రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి మధ్య వాగ్వాదం.. నువ్వు ఐటెం గార్ల్ వి.. నువ్వు కోవర్టువి


 


టీటీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, యువనేత రేవంత్ రెడ్డిల మధ్య ఉన్న కోల్డ్ వార్ గురించి అందరికి తెలిసిందే. ఎప్పటినుండో వీరిద్దరి మధ్య బేధాభ్రిపాయలు  నడుస్తున్నాయి. గత కొద్ది రోజుల క్రితమే జరిగిన తెలంగాణ అధ్యక్ష పదవిలో వీరిద్దరి మధ్య గట్టిపోటీనే ఏర్పడింది. అప్పుడు చంద్రబాబు పరిస్థితిని చక్కబెట్టి ఎవరూ నొచ్చుకోకుండా పదవులు కట్టబెట్టారు. అయితే మళ్లీ ఇప్పుడు వీరిద్దరి తీరుపై పార్టీకి సమస్యలు తలెత్తేలా కనిపిస్తున్నాయి. వరంగల్ ఉప ఎన్నికకు తేదీ ఖరారైన నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు గాను నిన్నఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా టీటీడీపీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో  రేవంత్ మాట్లాడుతూ... వరంగల్ లోకసభ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ పెట్టాలని ప్రతిపాదించారు. దీనికి ఎర్రబెల్లి కల్పించుకొని గత ఎన్నికల్లో మిత్రధర్మంతో బీజేపీకే ఛాన్సిచ్చామని, ఇప్పుడూ ఇవ్వకతప్పదని, అన్నీ ఆలోచించి మాట్లాడాలని బదులిచ్చారు. దీంతో కోపాద్రిక్తుడైన రేవంత్ రెడ్డి అంటే అన్నీ మీరేనా? చివరకు పార్టీ క్యాడర్‌కు పంపించే ఎస్సెమ్మెస్‌లు కూడా నీ పేరు, రమణ పేరుతోనే వెళ్తున్నాయని, నేను వర్కింగ్ ప్రెసిడెంట్‌ను అని, తన పేరు అక్కర్లేదా? చివరకు టీడీఎల్పీలో కూడా తన మాట వినడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డిల మధ్య మాటాల తూటాలు పేలాయి.

అంతేకాదు రేవంత్ రెడ్డి ఎల్.రమణపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తాను వర్కింగ్ ప్రసిడెంట్ అలాంటిది నాకు చెప్పకుండా  సమావేశాలు పెడుతున్నారని నాకు చెప్పాల్సిన అవసరం లేదా అని ఎల్ రమణను కూడా రేవంత్ అడిగినట్లుగా తెలుస్తోంది. దీంతో ఎర్రబెల్లి మళ్లీ కల్పించుకొని.. ఐనా నువ్వు పార్టీలో ఓ ఐటెం సాంగ్ గర్ల్‌గా మారిపోయావని, ఇలా వచ్చి అలా వెళ్తుంటావని, నీతో పార్టీకి ఒరిగిందేం లేదని వ్యాఖ్యానించగా దానికి రేవంత్ రెడ్డి నీలా నేను కోవర్టును కాదని ధీటుగా సమాధనమిచ్చారు.

అయితే ఈ గొడవలో ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్ధమవుతోంది. అందేంటంటే రేవంత్ రెడ్డి ఒంటరివాడయ్యాడనే విషయం. ఎందుకంటే ఎర్రబెల్లికి ఉన్నసీనియర్ల సపోర్టు రేవంత్ రెడ్డికి లేకపోవడం.. అంతేకాదు సీనియర్లంతా ఆయనపై గుర్రుమంటున్నారు. కాగా ఈ విషయాన్ని రమణ పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. మరి చంద్రబాబు ఏరకమైన నిర్ణయం  తీసుకుంటారో చూడాలి.

Teluguone gnews banner