Read more!

చలికాలంలో ఫిట్ గా ఉండాలంటే  ఈ 5 రకాల కూరగాయలు తినాలంతే.!

చలికాలంను జబ్బుల కాలం అని కూడా అంటారు. వాతావరణంలో మార్పుల కారణంగా శరీరం ఇబ్బందులకు లోనవుతుంది. ఇదే కాకుండా చలికాలంలో బ్యాక్టీరియా, వైరస్ ల వ్యాప్తి ఎక్కువ జరగడం వల్ల అంటువ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు చలికాలంలో చాలా బాధపడాల్సి ఉంటుంది. అయితే శరీరానికి మంచి రోగనిరోధక శక్తిని అందించి వ్యాధులు దరిచేరకుండా ఉండటానికి, శరీరం ఫిట్ గా ఉండటానికి ఈ 5 రకాల కూరగాయలను తప్పనిసరిగా తినాలి. అవేంటో తెలుసుకుంటే..

ముల్లంగి..

చలికాలంలో ముల్లంగి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.  దీంతో పుష్కలంగా ఫైబర్, నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని ఫిట్ గా ఉంచడంలో సహాయపడుతుంది.

క్యారెట్..

చలికాలంలో క్యారెట్ కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. క్యారెట్ లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది.   ఇది వ్యాధుల నుండి దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

పాలకూర..

చలికాలంలో తప్పనిసరిగా తినాల్సిన ఆకుకూరలలో పాలకూర మొదటిస్థానంలో ఉంటుంది. ఇందులో ఐరన్ సమృద్దిగా ఉంటుంది.  జీవక్రియను మెరుగ్గా ఉంచడంలో కూడా పాలకూర సహాయపడుతుంది.

బీట్ రూట్..

చలికాలంలో రోజూ బీట్ రూట్ తినడం వల్ల శరీరానికి చెప్పలేనంత ప్రయోజనం కలుగుతుంది. బీట్ రూట్ రక్తాన్ని మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. బీట్ రూట్ జ్యూస్ ను ప్రతిరోజూ తాగుతుంటే స్టామినా పెరుగుతుంది.

సొరకాయ..

సొరకాయ గురించి చాలామందికి సరిగా తెలియదు. ఆరోగ్యం మీద స్పృహ ఉన్నవారు సొరకాయను వంటల్లో వినియోగించడం కంటే  జ్యూస్ చేసుకుని తాగడానికి ఎక్కువ ఉపోగిస్తారు. ఇది బరువు తగ్గించడం నుండి శరీరాన్ని డిటాక్స్ చేయడం వరకు ఎన్నో రకాలుగా సహాయపడుతుంది. దీన్ని వంటల్లోనూ, జ్యూస్ గానూ తప్పకుండా చలికాలంలో తినాలి.

                   *నిశ్శబ్ద.