బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశ్రుతి.. పది మందికి గాయాలు
posted on Apr 12, 2023 @ 1:44PM
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా చీమలపాడు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో తీవ్ర అపశృతి చోటు చేసుకుంది.
ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఎంపీ నామా నాగేశ్వరావు, ఎంఎల్ఏ లావుడ్యా రాములు నాయక్ కు స్వాగతం పలుకుతూ బీఆర్ఎస్ నాయకులు పేల్చిన బాణాసంచ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి పది మంది తీవ్రంగా గాయపడ్డారు. కార్యకర్తలు పేల్చి బాణసంచా నిప్పురవ్వలు ఓ గుడిసెపై పడ్డాయి.
ఆ గుడిసెకు నిప్పంటుకుంది. గుడిసెలో ఉన్న గ్యాస్ బండ పేలడంతో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పది మంది తీవ్రంగా గాయపడ్డారు. నలుగురు వ్యక్తుల కాళ్లు తెగిపోయాయి. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉంది.