మెట్రో పట్టాలపై డ్రోన్ క్రాష్.. ఎక్కడంటే?
posted on Dec 25, 2022 @ 8:29PM
మోట్రో పట్టాలపై కుప్పకూలిన డ్రోన్ గంట పాటు భయాందోళనలను సృష్టించింది. మెట్రో సర్వీసులను నిలిపివేసింది. ఈ ఘటన ఢిల్లీలో ఆదివారం జరిగింది.
ఆదివారం (డిసెంబర్ 25) ఓ డ్రోన్ మెట్రో రైలు పట్టాలపై కుప్ప కూలింది. దీంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా మోట్రో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. మెట్రో స్టేషన్లు మూసి వేశారు. జసోలా మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు పట్టాలపై కుప్పకూలిన డ్రోన్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఆ డ్రోన్ ఒక ఫార్మా కంపెనీదని విచారణలో తేలింది. ఔషధాల సరఫరాకు ఆ కంపెనీ డ్రోన్ ను వినియోగిస్తున్నదని అంటున్నారు. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. డ్రోన్ కారణంగా నిలిచిపోయిన మెట్రో సర్వీసులను దాదాపు గంట తరువాత పునరుద్ధరించారు.