కేటీఆర్ సినిమాల్లో కొస్తున్నారా? మహేష్ బాబుతో నటిస్తారా?
posted on Dec 26, 2022 5:22AM
కల్వకుంట్ల తారకరామారావు, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మంత్రి. ఈ విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణ అభివృద్ధి పురోగతిపై ఏ సభలోనైనా, సమావేశంలోనైనా సాధికారికంగా మాట్లాడతారు.
మంచి వాగ్ధాటితో ప్రతర్యర్థులపై విమర్శలు గుప్పిస్తారు. ఇది ఒక పార్శ్వం.. మరో పార్శ్వం ఏమిటంటే ఆయన ఎప్పుడూ ఫిట్ గా ఉంటారు. అందుకోసం వర్కౌట్లు చేస్తారు. ఆయనకు సినిమా పరిశ్రమలో హీరోలు, నిర్మాతలతో మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులూ ఉన్నారు. తాజాగా ఆయన తాను వర్కౌట్లు చేస్తున్న ఫొటో ఒకటి ట్వీట్ చేశారు.
ఈ ఫొటో చూసిన ఆయన అభిమానులంతా ఫిదా అయిపోయారు. సినీ హీరోలా ఉన్నారంటూ పొగడ్తల వర్షం కురిపించేశారు. సినిమాల్లోకి రావాలనీ, మహేష్ బాబుతో కలిసి నటించాలనీ ట్వీట్ల వర్షం కురిపించేశారు. కేటీఆర్, మహేష్ బాబుల మధ్య మంచివ స్నేహ సంబంధాలున్న సంగతి తెలిసిందే కదా.