Read more!

జ‌గ‌న్ స‌భ‌కు ఆదిలోనే హంస‌పాదు...బ‌య‌ట‌ప‌డ్డ వైసీపీ విభేదాలు

ప్ర‌జ‌ల‌నుద్దేశించి మాట్లాడ్డానికి అన్ని ఏర్పాట్లు సిద్ధ‌మ‌యితేనే ర‌ధాలు క‌దులుతాయి. మంత్రులు, వంది మాగ‌దులు ఏ లోటు చేసినా రాజుగారు నీర‌సిస్తారు. అస‌లు ఆదిలోనే హంస‌పాద‌యితే!?  స‌రిగ్గా అదే జ‌రి గింది ఏపీ సీఎం జ‌గ‌న్ కుప్పం యాత్ర‌కి. అస‌లే విప‌క్ష‌నాయ‌కుడు చంద్ర‌బాబునాయుడు కేంద్ర‌స్థానం. అస‌లే రాజ‌కీయ ప‌రిస్థితులు బాగాలేని కాలం. కాలం, వేదిక అంత‌గా అన‌నుకూలం  కాని నేప‌థ్యంలో జ‌గ‌న్ యాత్ర‌కు అన్నీ అడ్డంకులే ఏర్ప‌డ్డాయి. దీనికి తోడు వీరాభిమాని  కాస్తా ఇబ్బంది క‌రంగా మారాడు. ఆయ‌న భ‌క్తి పార‌వ‌శ్యంలో పెట్టిన ఫ్లెక్సీలు  వ‌ర్గ విభేదాల‌ను లోకం చూసేట్టు చేసింది. ఏకంగా కుప్పంలో ఎటు చూసినా రెస్కో ఛైర్మ‌న్ సెంథిల్‌ ఫ్లెక్సీలే క‌న‌ప‌డుతున్నాయి. ఇటీవ‌ల తెదేపా అధినేత  చంద్ర బాబు సహా పలువురు పార్టీ నేతలను  అసభ్య పదజాలంతో దూషించిన మ‌హానుభావుడు రెస్కో ఛైర్మన్‌ సెంథిల్‌ కుమార్. వైసీపీ జనాగ్రహ దీక్షలో మాట్లాడిన ఆయన.. చంద్ర బాబు వాహనంపై బాంబు వేస్తా నని బెదిరింపులకు పాల్పడటం తెలిసిందే. 

ఇంత‌టి జ‌గ‌న్ వీరాభిమాని భారీ ప్ర‌చారం ముందు కుప్పం వైసీపీ ఇన్‌ఛార్జ్ భ‌ర‌త్ వ‌ర్గీయులు నిల‌వ‌లేక పోతు న్నార‌న్న‌ది ఇక్క‌డి మాట‌.  ఇలా కుప్పం వైసీపీలో వ‌ర్గ విభేదాల సంగ‌తి అలా బ‌య‌ట‌ప‌డింది. ఈ ఫెక్సీల మోతాదు పెర‌గ‌డంతో భ‌ర‌త్ వ‌ర్గీయులు మండిప‌డుతున్నారు. అదీ జ‌గ‌న్ స‌భ‌ను ఏకంగా బాయ్ కాట్ చేసేవ‌ర‌కూ వెళ్లింద‌ని బాగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి అధినేత రాకుండానే ఇంత జ‌రుగు తుంటే, ఆయ‌న వ‌చ్చాక ప‌రిస్థితి ఏమిటన్న‌ది వైసీపీ వ‌ర్గాలు ప‌లు విధాలుగా చ‌ర్చించుకుం టున్నారు. 

కాగా, జ‌గ‌న్ కుప్పం యాత్ర‌, స‌భ దిగ్విజ‌యం చేయ‌డానికి వైసీపీ అభిమానులు, నాయ‌కులు జ‌న‌స‌మీ క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో త‌ల‌మున‌క‌ల‌య్యారు. ఇప్ప‌టికే కుప్పంలో ఆర్టీసీ బ‌స్సులు, స్కూలు, కాలేజీ బ‌స్సులు కూడా అధీనంలోకి తెచ్చుకున్నారు. వాటిని కుప్పం, ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల‌ గ్రామాల్లోకి పంపి జ‌నాన్ని తీసుకురావ‌డానికి నిర్ణ‌యం తీసుకున్నారు. నిర్బంధంగా జ‌నాన్ని స‌భ‌కు తీసుకురావ‌ల‌న్న‌ ప‌ట్టుద‌లే వారిలో క‌న‌ప‌డుతోంద‌ని ఇక్క‌డ విప‌క్షాల మాట‌. జ‌గ‌న్ వ‌చ్చి వెళ్లే వ‌ర‌కూ విద్యా సంస్థ‌ ల‌కు, వ్యాపార సంస్థ ల‌కు సెల‌వు ప్ర‌క‌టించేసింది స‌ర్కార్‌. హెచ్చ‌రిక‌లు, బెదిరింపుల‌తో జ‌న‌స‌మీక‌ర‌ణ చేప‌ట్ట‌డం ప‌ట్ల టీడీపీ వ‌ర్గీయులు హేళ‌న చేస్తున్నారు. 

మరో వైపు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు అనుకున్న వారి ఇంటి ముందు పోలీసుల్ని కాపలా పెట్టారు. చాలామందిని హౌస్ అరెస్ట్ చేశారు. చంద్రబాబు పర్యటన సమయంలో గొడవలు జరిగిన ప్పు డు దెబ్బలు తిన్న టీడీపీ నేతలపైనే కేసులు పెట్టారు. ఆ కేసుల్లో ఇప్పటికీ కొంతమంది జైల్లోనే ఉన్నారు.. ఇలా టీడీపీపై పూర్తి స్థాయి ఆంక్షలు పెట్టి.. కుప్పం ప్రజల్ని కూడా బహిరంగసభకు రానీయ కుండా  అడ్డు కుని.. జగన్ పర్యటిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కుప్పానికి బస్సుల్లో జన సమీకరణ చేసి.. కుప్పం లో వెల్లువెత్తిన జనం అని ప్రచారం చేసుకోవడానికి తాపత్రయ పడుతున్నారు.