Read more!

అకార‌ణంగా  పేరు మార్చ‌డం ఎన్టీఆర్‌కు అవ‌మాన‌మే... పురంధేశ్వ‌రి

ఎన్టీఆర్‌పై గౌరవం అంటూనే ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు ఎన్టీఆర్‌కు అవ‌మాన‌మేని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. పేర్లు మారినా.. చాలా వరకు ఎన్టీఆర్ పెట్టిన పథకాలే అమలవు తున్నాయన్నారు. కారణం లేకుండా పేరు మార్పు ఎన్టీఆర్‌కు జరిగిన అవమానమేనని స్పష్టం చేశారు. 

వైకాపా ప్రభు త్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబా టి పురందేశ్వరి స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌పై గౌరవం అంటూనే ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు సరికాదని హితవు పలికారు. ఎన్టీఆర్ సామాజిక డాక్టర్ అని.. పేర్లు మారినా చాలావరకు ఎన్టీఆర్ పెట్టిన పథకాలే అమ లవుతున్నాయన్నారు. అకారణంగా పేరు మార్చడం ఎన్టీఆర్‌కు జరిగిన అవమానమేనని పురం దేశ్వరి దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై పోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌లో పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వాతావరణంలేదని మండిపడ్డారు. ఏ ప్రభుత్వం పైనా లేని కేసులు జగన్ సర్కార్‌పై వున్నాయని.. రాష్ట్రంలో మద్య పాన నిషేధం అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. 

కాగా,  ఇదొక దురదృష్టకరమైన పరిణామమని ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ  ఒక ప‌త్రికా ప్ర‌క ట‌న‌లో పేర్కొన్నారు. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు. హెల్త్ యూని వర్సిటీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. 1986లో ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ వర్సిటీని స్థాపించారని తెలిపారు. నాడు ప్రజలు, పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేశారని గుర్తుచేశారు. నందమూరి తారకరామా రావు గారు 1996లో మరణించిన తర్వాత అప్పటి సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ హెల్త్ యూని వర్సిటీగా పేరు పెట్టారని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రి గా ఉన్నప్పుడు ఎన్టీఆర్ మీద గౌరవంతో డాక్టర్ ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ వర్సిటీగా నామకరణం చేశారని చెప్పారు. ఆ పేరును‌ నేడు జగన్ మార్చడం దుర దృష్టకరమని పేర్కొన్నారు.