సైకో సూదిగాడిలా జగన్
posted on Sep 15, 2015 @ 10:23AM
ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు వేశారు. ఈ మధ్య అందరికి ఇంజక్షన్ ఇస్తూ గుబులు పుట్టిస్తున్న సైకో సూదిగాడితో వైఎస్ జగన్ ను పోల్చి విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన లారీ ప్రమాదంలో గాయపడిన కురందాసు రాజును పరామర్శించడానికి వెళ్లి జరిగిన ప్రమాదం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని.. అతను పూర్తిగా కోలుకునే వరకూ మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. కాగా రాష్ట్రంలో సూదిగాళ్ల సమస్య ఎక్కవైందని.. జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు ఓ పెద్ద సైకో సూదిగాడిగా తయారయ్యాడని.. ఎక్కడ ఎప్పుడు గుచ్చుతాడో తెలియడం లేదని.. అతని మానసిక పరిస్థితి బాలేదని ఉమా ఎద్దేవ చేశారు. ప్రభుత్వం చేసే మంచి పనులు ఏమి జగన్ కు కనపడవని.. ప్రతి విషయాన్ని విమర్శించమంటే మాత్రం ముందుంటారని అన్నారు.