పవన్ పొలిటికల్ టూర్.. మూహూర్తం ఖరారు..!
posted on Sep 15, 2015 @ 10:57AM
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్ర్రపదేశ్ పర్యటనలో భాగంగా ప్రజల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రరాష్ట్రంలో పర్యటనకు గాను ఆయన మూహూర్తం కూడా ఖరారు చేశారని.. మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2 నుంచి రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పర్యటనలో శ్రీకాకుళం నుండి తన పర్యటనను ప్రారంభిస్తారని.. ఈ పర్యటనలో ఆయన ప్రజలు బాధపడుతున్న అనేక అంశాలపై వారితో చర్చించనున్నట్టు తెలుస్తోంది.
కాగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ భూసేకరణ అంశంపై ప్రభుత్వంపై పోరాడి వారి తీసుకున్న నిర్ణయాన్నే వెనక్కితీసుకునేలా చేశారు. ఒక రకంగా దీనివల్ల పవన్ కళ్యాణ్ పై ప్రజల్లో కొంత నమ్మకం ఏర్పడిందనే చెప్పాలి. ఇదిలా ఉండగా బీజేపీ టీడీపీ మిత్రపక్షాలని అందరికీ తెలిసిందే. ఈ పార్టీలకి గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూడా మద్దతు పలికారు. అయితే ఇప్పుడు టీడీపీ సంగతమే కాని పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని.. పవన్ కళ్యాణ్ మద్దతు ద్వారా ఎపిలో పాగా వేయాలని బిజెపి చూస్తున్నట్టు తెలుస్తోంది. మరి వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటారో లేదో చూడాలి.