లలిత నువ్వు నా దేవత..వేరే పెళ్లి చేసుకో.. బాబును బాగా చూసుకో..
posted on Jun 5, 2021 @ 4:19PM
నువ్వు నా దేవత.. నువ్వు నా భార్య కావడం నా అదృష్టం.. కానీ ఏరోజూ నిన్ను సరిగా చూసుకోలేదు.. నన్ను క్షమించు లలిత. నేను చనిపోయిన తర్వాత నువ్వు మరొకరిని పెళ్లి చేసుకోవాలి.. బాబును బాగా పెంచాలి.. నువ్వు ఆనందంగా ఉండాలి. ఇది సినిమా డైలాగ్ కాదు. కానీ గీతాంజలి సినిమాలో స్ట్రెచర్ మీద ఉన్న హీరోయిన్, హీరోతో అన్నట్లు.. అతను తన లేఖలో రాశాడు.. హాస్పిటల్ కి తీసుకెళ్లారు. స్ట్రెచర్ పై ఉన్న అతను తన భార్యను గుర్తు చేసుకున్న మాటలు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం..?
అది విశాఖపట్నం. నగరంలోని గోపాలపట్నం. అతని పేరు. అరుణ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతని భార్య పేరు లలిత. వారిద్దరికీ ఓ కొడుకు కూడా ఉన్నాడు. కుటుంబ విషయాల్లో అతనికి భార్యతో మనస్పర్థలు వచ్చాయి. అప్పటినుండి అరుణ్ సోదరుడితో కలిసి పెందుర్తిలో నివాసం ఉంటున్నాడు. గోపాలపట్నంలోని చికెన్ షాప్‌లో పని చేస్తున్నాడు. అతని భార్య మాడుగుల గ్రామంలో ఉంటుంది. భార్య తిరిగి వస్తుందని అనుకున్నాడు. అయినా ఆమె తిరిగి రాకపోవడంతో మనస్తాపం చెందిన అరుణ్ మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులోనే ఆత్మహత్యకు యత్నించాడు. చేతి మణికట్టు కోసుకొని ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. గోపాలపట్నం బాజీ జంక్షన్ సబ్ స్టేషన్ వద్ద అరుణ్ అనే యువకుడు చేతి మణికట్టు కోసుకొని ఆత్మహత్యకు యత్నించడం స్థానికంగా కలకలం రేపింది. 108 వాహనంలో ప్రధమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం అరుణ్‌ను కేజీహెచ్‌కు తరలించారు. లో కుటుంబ కలహాలే ఆత్మహత్యా యత్నానికి కారణంగా తెలిసింది.
సూసైడ్ నోట్‌లో భార్య లలితను వేరొక పెళ్లి చేసుకోమని, బాబుని బాగా చూసుకోమని అరుణ్ రాయడం గమనార్హం. ‘లలిత.. నీకు అన్యాయం చేశాను.. మళ్లీ జన్మంటూ ఉంటే నీవే నా భార్య కావాలని కోరుకుంటాను’ అంటూ అరుణ్ సూసైడ్ నోట్‌లో రాశాడు. తాను చనిపోతున్నానని, తనను క్షమించాలని కోరాడు. ఇదిలా ఉంటే.. అరుణ్ గురించి ఆరా తీసేందుకు పోలీసులు ఆస్పత్రికి వెళ్లగా.. ఈలోపే అరుణ్ అక్కడి నుంచి పరారయ్యాడు. అతని గురించి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. అంతేకాదు.. ఆ సూసైడ్ నోట్‌లో భార్యపై తనకున్న ప్రేమను చాటుకునేలా అరుణ్ కొన్ని వాక్యాలు రాశాడు. అయితే.. అరుణ్ మద్యం మత్తులో ఇలా ఆత్మహత్యకు యత్నించాడా లేక భార్య దూరమై మానసిక ఒత్తిడిలో ఇలా చేశాడా అనేది తెలియాల్సి ఉంది.