ఒమిక్రాన్ కంటే డెల్టానే డేంజర్.. భయం వద్దు.. జాగ్రత్త మరవద్దు..
posted on Dec 24, 2021 @ 12:13PM
ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ భయాలు నెలకొన్నవేళ ప్రపంచ ... ఒక శుభ వార్త. ప్రపంచ పత్రికలు అన్నీ మోసుకొచ్చిన తీపి కబురు. కొవిడ్ 19 కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ భయ పెట్టినంత భయంకరం కాదు. అంతగా బాధించదు. అవును, డెల్టా వేరియంట్’తో పోలిస్తే ‘ఒమిక్రాన్’ అంతగా ప్రాణాంతకం కాదు. ఆసుపత్రి చికిత్స అవసరం లేకుండానే ‘ఒమిక్రాన్’ నుంచి బయట పడవచ్చును. ‘ఒమిక్రాన్’ ఎంత వేగంగా వ్యాప్తి చెందినా, అంతే వేగంగా నిర్వీర్యమై పోతుంది.
ఒకే రోజున ‘ఒమిక్రాన్’ ప్రభావం అధికంగా ఉన్న విదేశీ పత్రికలో వచ్చిన వార్తలను గమనిస్తే, ఒమిక్రాన్, భయపెట్టినంతగా బాధించదు కోవిడ్ మహమ్మారి కాలం చేసే సమయం ఆసన్నమైందని పిస్తుంది. ‘ది గార్డియన్’ ,’న్యూ యార్క్ టైమ్స్’, వాల్ స్ట్రీట్ జర్నల్’, ‘ది వాషింగ్టన్ పోస్ట్’ ,ఇంకా అనేక పత్రికలు ఏ పత్రిక చూసినా, కొవిడ్ ‘మహామ్మరి కథ ముగింపుకు వచ్చిందన్న సంకేతాలనే ఇస్తున్నాయి. ముఖ్యంగా కొవిడ్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ విషయంగా అంతగా ఆందోళన చెందవలసిన అవసరం లేదని స్పష్ట మవుతోంది.
‘Risk of hospital stay is 40 % lower with Omicron variant, data shows’ రోజుకు లక్ష ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న యూకేలో నిర్వహించిన అధ్యయనంలో తేలిన సత్యమిది. ఈ నివేదికను, ‘ది గార్డియన్’ పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. ఈ నివేదిక ప్రకారం, డెల్టా వేరియంట్’తో పోలిస్తే ‘ఒమిక్రాన్’ 20 నుంచి 25 శాతం తక్కువ ప్రభావం చూపుతుంది. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందవలసిన అవసరం డెల్టాతో పోలిస్తే 40 శాతం తక్కువగా ఉంటుంది. ఆసుపత్రి చికిత్స అవసరం అయినా, అవుట్ పేషంట్’గానే కాని, ఆసుపత్రిలో చేరి రోజుల తరబడి చికిత్స తీసుకోవలసిన అవసరం అయితే ఉండదని అధ్యయనంలో తేలిందని నిపుణులు నిర్ధారించారు. అదే కథనాన్ని, ది వాల్ స్ట్రీట్ జర్నల్’ ..’Omicron found to pose lower illness risks’ అనే మకుటంతోప్రచురించింది. మకుటం ఏదైనా విషయం మాత్రం ఒకటే.. ఒమిక్రాన్’ అంత ప్రమాదకరం కాదు.
‘అదొక్కటే కాదు, ‘ఒమిక్రాన్’ పుట్టిల్లు దక్షిణ అఫ్రికా’ లో ఒమిక్రాన్ కేసులు ఎంత వేగంగా పిపైకి పరుగులు తీశాయో.. అంత కంటే వేగంగా కిందికి దిగివచ్చాయి. దక్షిణాఫ్రికాలో ఓమిక్రాన్ కదలికలపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయే విధంగా కొత్తగా నమోదవుతున్న కేసులు దిగి వస్తున్నాయి. గత గురువారం, 27 వేల కొత్త కేసులు నమోదైతే, నాలుగు రోజుల్లో కొత్త కేసులు 15వేలకు దిగివచ్చాయి .. అక్కడి నుంచి ఇప్పుడు ఉన్నాయంటే ఉన్నాయి అనే స్థాయికి దిగివచ్చాయి. అంటే ఒక వారం రోజుల్లోనే ఒమిక్రాన్ వచ్చినంత వేగంగా వెళ్ళిపోయిందని, శాస్త్ర వేత్తలు సంతోషం వ్యక్తరుస్తున్నారు. అంతేకాదు, ‘ఒమిక్రాన్’ వలన మరణాలు అంతగా సంభవించలేదు. ఆసుపత్రులలో చేరిన వారి సఖ్య కూడా చాలా స్వల్పంగానే ఉందని, శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్త పరుస్తున్నారు.
అదలా ఉంటే, అనేక వేరియంట్లుగా ప్రపంచాన్ని కబళించిన కరోనా మహమ్మారి కథ ముగింపుకు వచ్చిదా అంటే, అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఫైజర్ సంస్థ 'పాక్స్లోవిడ్' పేరుతో తయారు చేసిన మాత్ర కోవిడ్’ను యిట్టె పారదోలుతుందని అంటున్నారు. ఆమెరికా ఎఫ్డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్) ఈ మాత్రను అధికారికంగా ఆమోదించింది.కొవిడ్ బారినపడిన రోగులు ఈ మాత్రను తీసుకుంటే ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం 90 శాతం తగ్గుతుంది. మరణం ముప్పు దాదాపు ఉండదు. ఇంతటి కీలక ఔషధాన్ని అమెరికావ్యాప్తంగా అందుబాటులోకి తేనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రోజుకు 2 లక్షలకుపైగా కేసులు వెలుగు చూస్తున్న ప్రస్తుత విపత్కర పరిస్థితిలో ఫైజర్ మాత్ర గేమ్ ఛేంజర్ అవుతుందని భావిస్తోంది.మరో వంక ఫైజర్ మాత్రతో పాటు మెర్క్ అభివృద్ధి చేస్తున్న కొవిడ్ మాత్ర కూడా ఒమిక్రాన్పై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఏమీ కాదులే అనే భరోసా పనికి రాదని, భయం వదిలి జాగ్రత్తలు పాటించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.