అదే రోజు బస్సు కిందకు తోసేసి..........

 

 

ఢిల్లీ లోని ఓ బస్సులో ఆరుగురు వ్యక్తుల చేతిలో దారుణంగా అత్యాచారానికి గురి అయి, ఆ తర్వాత మరణించిన 23 సంవత్సరాల పారా మెడికల్ స్టూడెంట్ కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. రేప్ చేసిన వెంటనే వారు ఆమెను హత్య చేయాలని పన్నాగం పన్నారు.

 

రేప్ జరిగిన వెంటనే భాదితురాలిని, ఆమె స్నేహితుడిని వారు బస్సులో నుండి తోసేశారు. ఆ వెంటనే వారిఫై నుండి బస్సు నడిపి వారిని హత్య చేయాలని భావించారు. ఆ బస్సు తమవైపు వేగంగా వస్తుందని గ్రహించిన ఆమె స్నేహితుడు ఆమెను రెప్పపాటులో పక్కకు లాగాడు. దీనితో, ఆమె ఆ సమయానికి తన ప్రాణం కాపాడుకోగలిగింది. వారిద్దరూ మొదట బస్సు ఎక్కిన వెంటనే, బస్సులో ఉన్న ఆ ఆరుగురు వ్యక్తులు ప్రయాణీకులేనని భావించారు.

 

అయితే, కొద్ది సేపటికే వారంతా ఆ యువతితో అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. దీనిని వారించిన ఆమె స్నేహితుడిఫై వారు చేయి చేసుకున్నారు. ఈ దాడిని అడ్డుకొన్న ఆమెను కూడా వారు కొట్టారు. అనంతరం వారు ఆ యువతిని బస్సు వెనక్కి తీసుకెళ్ళి అంతా కలిసి రేప్ చేశారు. రేప్ ను అడ్డుకొనే ప్రయత్నంగా ఆ యువతి వారిని కొరికింది. వారి శరీరాలఫై ఉన్న పంటి గాట్లను గూడా పోలీసులు ఈ కేసులో సాక్ష్యంగా చూపనున్నారు.

 

ఢిల్లీ పోలీసులు తమ వెయ్యి పేజీల చార్జ్ షీట్ లో ఈ వివరాలను పొందు పరచినట్లు సమాచారం. ఈ చార్జ్ షీట్ ను మరో రెండు రోజుల్లో పోలీసులు కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది.

Teluguone gnews banner