'రేప్’ నిందితుడు రామ్ సింగ్ ఇంటి పేల్చివేతకు ప్రయత్నం
posted on Jan 2, 2013 @ 12:01PM
గత నెల 16 వ తేదీన ఢిల్లీ లో పారా మెడికల్ స్టూడెంట్ ను రేప్ చేసిన ఘటనతో ఆగ్రహించిన కొంత మంది వ్యక్తులు ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న రామ్ సింగ్ ఇంటిని పేల్చివేయడానికి నిన్న ప్రయత్నం చేశారు.
దక్షిణ ఢిల్లీ ఆర్.కె.పురంలోని రవి దాస్ మురికివాడ సమీపంలో గల ఆయన ఇంటి వద్ద కొంత మంది అనుమానాస్పద వ్యక్తులు నిన్న తిరుగుతూ ఉండగా, స్థానికులు వారిని పట్టుకొన్నారు. వారిలో ఇద్దరు వ్యక్తులు పారిపోగా, రాజేష్ (37) అనే వ్యక్తి మాత్రం స్థానికుల చేతికి దొరికి పోయాడు. రామ్ సింగ్ ఇంటి వద్ద టపాసుల్లో వాడే పేలుడు పదార్ధాలతో తయారుచేసిన బాంబులు పెట్టి వారు పారిపోతుండగా స్థానికులు వారిని వెంబడింఛి రాజేష్ అనే వ్యక్తిని పట్టుకోగలిగారు.
ఆ వ్యక్తి నుండి పోలీసులు రెండు నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు.