డిసెంబర్ 22న ముగియనున్న నిర్భయ నిందితుడి గడువు.. తరువాత?
posted on Dec 3, 2015 @ 3:51PM
నిర్భయ కేసులో అందరికి శిక్ష పడగా ఒక్క పిల్ల పిశాచి మాత్రం తప్పించుకున్న సంగతి తెలిసిందే. మైనర్ అనే ఒకే ఒక్క కారణం చేత ఆ దుర్మార్గుడు శిక్ష నుండి తప్పించుకున్నాడు. కానీ అత్యంత దారుణమైన విషయం ఏంటంటే.. నిర్భయ చెప్పిన వాంగూల్మం ప్రకారం అందరి కంటే ఎక్కువ తనను హింసించింది బాల నేరస్తుడే అని తెలిపింది. అలాంటి వాడికి మైనర్ అన్న సాకుతో మూడేళ్ల జైలు శిక్ష మాత్రమే పడింది. అయితే ఈనెల 22తో అతడి శిక్ష పూర్తవుతుంది. దీంతో అతడిని విడుదల చేస్తారా? లేదా? అన్నది అందరి సందేహం. అయితే ఈ విషయంపై అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అతని గడువు ముగిసిన తరువాత విడుదల చేయకుండా ఒక స్వచ్ఛంద సంస్థ అధ్వర్యంలో ఉంచి అతని ప్రవర్తనను మరో ఏడాది గమనించి ఆ తరువాత తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. మరోవైపు ఇప్పటి వరకూ అతని ఫేస్ కూడా ఎవరికి చూపించలేదు పోలీసులు. ఈ నేపథ్యంలో అతని ఫేస్ అందరికి చూపించాలని నిర్భయ తల్లిదండ్రులు మానవ హక్కుల సంఘాన్ని కూడా కోరారు.