రెండు కుక్కలకు మరణశిక్ష.. మీ ఇంట్లో కుక్కలు ఉన్నాయా.. అయితే జాగ్రత్త..
posted on Jul 13, 2021 @ 4:05PM
ఎక్కడైనా మనుషులకు మరణ శిక్ష విధిస్తారు.. అది అందరికి తెలిసిన విషయమే.. తాజాగా ఓకే కోర్టు విధించిన మరణ శిక్షను వింటే మీరు ఆశ్చర్య పోతారు.. ఇంతకీ ఏంటి ఆ శిక్ష అని అనుకుంటున్నారా ? రెండు కుక్కలకు మరణ శిక్ష విధించింది ఓ కోర్టు.. అదేంటి అని కుక్కలకు శిక్ష వేయడం ఏంటి..? అందులోను మరణ శిక్ష వేయడం ఏంటని అనుకుంటున్నారా .. మనుషులకు మరణశిక్ష విధించారనే వార్తలు తరచుగా వస్తుంటాయి. పెద్ద నేరం చేసిన వ్యక్తులకు కోర్టులు మరణశిక్ష విదిస్తాయి. మరి కుక్కలపై ఇలాంటి తీర్పు ఏంటి అని మీకు సందేహం కలగొచ్చు.. మీరు విన్నది నిజం.. అయితే ఇంతకీ ఆ కుక్కలు చేసిన తప్పేంటి అని తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే ..
వివరాల్లోకి వెళితే కరాచీకి చెందిన మీర్జా అక్తర్ అనే లాయర్ మార్నింగ్ వాక్ కోసం బయటకు వచ్చాడు. అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా రెండు కుక్కలు అతడిపై ఎగబడి దాడి చేశాయి. అందినంత కందని లాగేశాయి.. ఈ దాడులో సదరు లాయర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఈ ఘటనకు సంబందించిన ఆధారాలు దృశ్యాలు వీధిలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆ వీడియోస్ ని కొందరు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ మారాయి. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కల యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇక అక్తర్ లాయర్ కావడంతో తనకు జరిగిన విషమై కోర్టుకు వెళ్లాడు. కేసు పెట్టాడు.. అయితే చివరికి కుక్కల యాజమాని హుమయూన్ ఖాన్ రాజీకి వచ్చాడు. లాయర్ అక్తర్ రాజీకి అంగీకరిస్తూనే పలు షరతులు పెట్టాడు. భవిష్యత్ లో ఇలాంటి ప్రమాదకర కుక్కలను ఇంట్లోనే పెంచుకోవాలని.. తనపై దాడి చేసిన కుక్కలను వెంటనే వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకుకెళ్లి విషపూరిత ఇంజెక్షన్లతో చంపేయాలని షరతులు విధించారు. ఇక ఈ ఒప్పందం కుక్కల యజమానికి కూడా నచ్చడంతో ఇద్దరు సంతకాలు చేశారు. కుక్కలకు మరణశిక్ష విధించడంపై నెటిజన్లు పడుతున్నారు. కుక్కలు పెంచుకోవాలి గానీ మరి రోడ్డులో పోయే మనుషులను కరవడం ఏంటి..? అందుకు ఆ కుక్కలా యజమాని కారణం అని స్థానికులు అంటున్నారు.. మీ ఇంట్లో కుక్కలు ఉన్నాయా ? అయితే జాగ్రత్త.. ఈ సంఘటన పాకిస్తాన్ లో జరిగింది..