19 మందిని రే*ప్ చేసిన పోలీస్.. సైకో ఉమేశ్‌రెడ్డికి ఉరి కన్ఫామ్..
posted on Oct 1, 2021 @ 3:33PM
వాడు పోలీస్ కాదు.. ఖాకీ దుస్తుల్లో ఉన్న సైకో కిల్లర్. ఒకరు ఇద్దరు కాదు.. ఏకంగా 19 మంది మహిళలపై అత్యా-చారానికి తెగబడ్డాడు. వారిలో కొందరిని దారుణంగా చంపేశాడు. వారి మృతదేహాలపై కూడా లై*గిక దాడి చేసేవాడు. ఆ ఉన్మాది పేరు బీజే ఉమేశ్ అలియాస్ ఉమేశ్‌రెడ్డి. కర్ణాటకకు చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్.
19 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడి, పలువుర్ని హత్యచేసినట్టు ఉమేశ్ రెడ్డిపై అభియోగాలు నమోదయ్యాయి. ఓ మహిళపై అత్యాచారం చేసి ఆమెను హత్య చేయడానికి ప్రయత్నిస్తుండగా బాధితురాలు తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉమేశ్ వ్యవహారం బయటపడింది. పోలీసులు వలపన్ని నిందితుడిని పట్టుకున్నారు. విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఉమేశ్‌రెడ్డి ఏకంగా 19 మందిపై హత్యా-చారం చేశాడని తేల్చారు. అందులో కొందరిని హత్య చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడు. ఆధారాలు సేకరించి అతన్ని కోర్టులో హాజరుపరిచారు.
ఉమేశ్‌పై 11 కేసుల్లో విచారణ పూర్తయి శిక్షలు పడగా.. మరో 8 కేసుల్లో తీర్పు రావాల్సి ఉంది. తాజాగా, నరహంతకుడు ఉమేశ్‌రెడ్డి (48)కి కర్ణాటక హైకోర్టు ఉరి శిక్ష ఖరారు చేసింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లేందుకు ఆరు వారాల సమయమిచ్చింది.
కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో 19 మందిపై అత్యా-చారానికి పాల్పడి.. పలువుర్ని హత మార్చినట్లు కోర్టు విచారణలో తేలింది. బెంగళూరు పరిధిలోని పీణ్యలో 1998లో ఓ మహిళపై హత్యా-చారానికి పాల్పడిన కేసులో 2006లో సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది. దీనిని 2011లో కర్ణాటక హైకోర్టు సమర్ధించింది. అయితే, తన కుమారుడికి ఉరిశిక్ష రద్దుచేసి, యావజ్జీవిత ఖైదు విధించాలంటూ అతడి తల్లి గౌరమ్మ 2013లో రాష్ట్రపతికి క్షమాభిక్ష అర్జీ పెట్టుకున్నారు. అందుకు రాష్ట్రపతి తిరస్కరించారు.
ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని 2016లో సుప్రీంకోర్టులో అప్పీలు చేశాడు. ఈ విషయంలో హైకోర్టునే సంప్రదించాలని సుప్రీంకోర్టు సూచించింది. సెషన్స్ కోర్టు విధించిన ఉరి శిక్షను హైకోర్టు ధర్మాసనం సమర్థించింది.