బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తమిళనాడుకు అతి భారీ వర్ష సూచన
posted on Jan 7, 2026 @ 9:36AM
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బుధవారానికి (జనవరి 7) వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే తమిళనాడుతో పాటు పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లోకూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వచ్చే 48 గంటలలో ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశాలున్నాయని పేర్కొంది.
కాగా దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఉండే అవకాశాలు లేవని పేర్కొంది. ఏపీలో వాతావరణం పొడిగా ఉంటుందనీ, అదే సమయంలో ఉదయం, సాయంత్రం వేళల్లో దట్టమైన పొగమంచు కమ్ముకునే అవకాశాలున్నాయనీ పేర్కొంది. అయితే వాయుగుండ ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గుతుందని పేర్కొంది.