ఏపీలో తుపాను ప్రభావంతో వర్ష బీభత్సం
posted on Dec 5, 2023 @ 1:46PM
ఏపీలో తుపాను బీభత్సం సృష్టిస్తోంది. బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. తీరం దాటిన తరువాత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశముంది. కాగా బాపట్ల తీర ప్రాంతంలో ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తోంది. సముద్రంలో అలలు సుమారు 2మీటర్ల మేర ఎగసిపడుతున్నాయి.
కాగా తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులకు పలు చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పంట నష్టం భారీగా ఉంది. ఇక తిరుమలలో జలాశయాలు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరాయి. రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి విమానరాకపోకలను నిలిపివేశారు.
ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే 18 విమానసర్వీసులను రద్దు చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేట, ఒంటిమిట్ట, సిద్దవటంలో తుపాను కారణంగా ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది.