జగన్ హయాం ఒక నేర సామ్రాజ్యం.. ఎన్సీఆర్బీ నివేదిక
posted on Oct 1, 2025 @ 12:35PM
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ హయాం ఒక నేర సామ్రాజ్యంగా మారిందని జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. జగన్ హయాంలో రాష్ట్ర మొత్తం నేరమయంగా మారిందనీ, ప్రజలంతా బాధితులుగా మారిపోయారని పేర్కొంది. సాక్ష్యాలతో సహా తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆంధ్ఱప్రదేశ్ లో జగన్ హయాంలో దళితులు, మహిళలు, పిల్లలపై అసంఖ్యాకంగా ఘోరాలూ, నేరాలూ జరిగాయని ఎన్సీఆర్బీ 2023 నివేదిక పేర్కొంది. జగన్ హయాంలో ఏపీలో పోలీసులంతా రాజకీయం కోసమే పని చేశారని పేర్కొంది. దేశ వ్యాప్తంగా మొత్తం 58 రాజద్రోహం కేసులు నమోదైతే.. ఆంధ్రప్రదేశ్ లో 11 రాజద్రోహం కేసులు నమోదయ్యాయి. కల్లోల మణిపూర్ తరువాత ఏపీలోనే ఈ తరహా కేసులు అధికంగా నమోదయ్యాయి. ఏపీలో పరిస్థితి అప్పట్లో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తడమే రాజద్రోహం అన్నట్లుగా ఉండేదని ఆ నివేదిక పేర్కొంది.
ఇక రాజకీయాల కోసం వర్గాల మధ్య చిచ్చులు పెట్టడంలోనూ వైసీపీ హయాంలో పెచ్చరిల్లిపోయిందని నివేదిక వివరించింది. ఇక మహిళలపై జరిగిన దాడుల గురించైతే చెప్పాల్సిన పనే లేదు. దేశ వ్యాప్తంగా మహిళలపై 8,416 కేసులు నమోదు వాటిలో 2,826 అంటే 33.57% కేసులు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే నమోదయ్యాయి. ఈ తరహా నేరాలకు గురైన బాధితుల సంఖ్య దేశం మొత్తంలో 8,661 ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 3,020 మంది ఉన్నారు. షెల్టర్‌హోమ్‌లలో బాలికలపై లైంగిక వేధింపుల విషయంలోనూ దేశం మొత్తంలోనే ఏపీ మూడో స్థానంలో నిలిచింది.
ఇక దళితులపై దాడుల విషయంలో ఏపీ దక్షిణాదిలోనే అగ్రస్థానంలో నిలిచింది. జగన్ హయాంలో వారానికి ముగ్గురు దళిత మహిళలపై అత్యాచారాలు జరిగాయని కేసులను బట్టి చూస్తే అర్ధమౌతుంది. ఇక ఎస్సీఎస్టీ అట్రాసిటీస్ కేసుల విషయంలో కూడా ఏపీ అగ్రపీఠినే నిలిచింది. దేశవ్యాప్తంగా 57,789 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైతే.. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 2,027 నమోదు అయ్యాయి. ఈ తరహా కేసుల్లో దక్షిణాది రాష్ట్రాలలో ఏపీయే నంబర్ వన్ గా ఉందని ఆ నివేదిక వెల్లడించింది.