పిచ్చి పీక్స్ అంటే ఇదే.. ఓరి దేవుడోయ్ తాచు పాముకు స్నానం!
posted on Dec 5, 2022 9:27AM
జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అన్నారు. అంటే ఎవరి తీరు వారిదే అని చెప్పడమే. అయితే ఎవడి పిచ్చి వాడికానందం అని కూడా అన్నారు. అయితే ఇలాంటి పిచ్చి పీక్స్ చేరుకున్న వారిని మాత్రం ఎర్రగడ్డ వంటి ఆస్పత్రులకు పంపాల్సిందే. ఎందుకంటే సమాజంలో ఉంటే వారు తమంత తాము ప్రమాదంలో పడటమే కాకుండా పక్కవాళ్లకి కూడా ముప్పు తెచ్చి పెడతారు.
అదేదో సినిమాలో డైలాగ్ ఉంది.. ఒరేయ్ వాడిని అలా వదిలేయకండిగా.. ఎవరికైనా చూపించండిరా అని. తాచు పాముకు శ్రద్ధగా స్నానం చేయించిన వ్యక్తి గురించి తెలుసుకుంటే ఎవరైనా సరే అనే మాట.. వాడిని అలా వదిలేయకండిరా బాబూ.. ఎవరికైనా చూపించండి అని.
తాజాగా నెట్టింట వైరల్ అయిన ఓ వీడియోలో ఒక వ్యక్తి తాచుపాముకు తలస్నానం చేయించడం కనిపిస్తోంది. దీంతో ఆ పాము కసిదీరా డబ్బాను కాటేస్తోంది. ఈ వీడియో వైరల్ అవ్వడమే కాదు.. తాచు పాముతో ఆటలేంటంటూ నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిచ్చి పీక్స్ కు వెళ్లడమంటే ఇదేనని సెటైర్లు వేస్తున్నారు. తాచుపామును అలా హింసిండం నేరమని హెచ్చరిస్తున్నారు.