ఏ వ్యాక్సిన్ సామర్ధ్యం ఎక్కువ? యాంటీబాడీల పరిస్థితి ఏంటీ?
posted on Jun 7, 2021 @ 9:34PM
కొవిడ్ మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషన్ ప్రధానమని వివిధ అధ్యయన సంస్థలు, వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా కట్టడి అయిన దేశాల్లోనే వ్యాక్సినేషనే కీలకమైంది. అందుకే మన దేశంలోనూ టీకాల పంపిణిని యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తున్నారు. మన దేశంలో ప్రస్తుతం రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. త్వరలో రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ పంపిణి కానుంది. అయితే దేశంలో అందిస్తున్న టీకాలలో ఏది బెస్ట్, దేని సామర్ధ్యం ఎక్కువయ ఏ టీకాతో శరీరంలో యాంటీబాడీలు ఎక్కువగా తయారవుతున్నాయన్నది ఆసక్తిగా మారింది. జనాలు కూడా ఈ అంశాలను తెలుసుకునేందుకు గుగూల్ లో వెతుకున్నారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి సిద్ధమవుతున్న వారు కూడా ఏ టీకా తీసుకోవాలా అన్న దానిపై ఆలోచనలో పడుతున్నారు.
మన దేశంలో ప్రధానంగా రెండు వ్యాక్సిన్లు ఉన్నాయి. ఒకటి ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనెకాకు చెందిన కొవిషీల్డ్ .హైదరాబాద్ బయోటెక్ కు చెందిన కొవాగ్జిన్. కరోనాను కట్టడి చేయడంలో ఈ రెండు వ్యాక్సిన్లు దేనికవే ప్రత్యేకమనే అభిప్రాయాలున్నాయి ఈ మేరకు అధ్యయన సంస్థలు కూడా అదే చెప్పాయి. అయితే డాక్టర్ ఏకే సింగ్ ఆయన సహచర వైద్య నిపుణులు ఈ రెండు వ్యాక్సిన్లపై అధ్యయనం చేసి మరిన్ని అద్భుతమైన విషయాలను వెల్లడించారు. ప్రధానంగా రెండు వ్యాక్సిన్లలో యాంటీబాడీలు ఎక్కువగా వృద్ధి రేటుపై కొత్త విషయాన్ని కనుగొన్నారు.
యాంటీబాడీల అభివృద్ధిలో మాత్రం కొవిషీల్డ్ ఎంతో మెరుగ్గా పనిచేస్తున్నట్టు అధ్యయనంలో తేలింది. మొత్తం 515 మంది ఆరోగ్య కార్యకర్తలపై ఈ పరిశోధన చేశారురు. వీళ్లలో 305 మంది పురుషులు 210 మంది మహిళలు ఉన్నారు. వీళ్లు ఈ వ్యాక్సిన్ల రెండు డోసులు తీసుకున్నారు. మొత్తం 425 మంది కొవిషీల్డ్ తీసుకున్న వాళ్లలో 98.1 శాతం.. 90 మంది కొవాగ్జిన్ తీసుకున్న వాళ్లలో 80 శాతం సెరోపాజిటివిటీ కనిపించినట్టు అధ్యయన బృందం తేల్చింది. రోగ నిరోధక వ్యవస్థను అందించడంలో రెండు వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నట్టు తెలిపారు. అయితే సెరోపాజిటివిటీ రేట్లు సగటు యాంటీ-స్పైక్ యాంటీబాడీ టైటర్ల విషయానికి వస్తే మాత్రం కొవాగ్జిన్ కంటే.. కొవిషీల్డ్ చాలా మెరుగ్గా ఉన్నట్లు అధ్యయన బృందం గుర్తించింది.
యాంటీబాడీ టైటర్ బ్లడ్ టెస్టులు కూడా చేశారు. దీని ప్రకారం కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో యాంటీబాడీ టైటర్ 115 AU/ml గా ఉండగా.. కొవాగ్జిన్ తీసుకున్న వాళ్లలో 51 AU/mlగా ఉంది. ఈ లెక్కన కొవాగ్జిన్ కంటే కొవిషీల్డ్ లో యాంటీ బాడీల సంఖ్య చాలా ఎక్కువని ఈ అధ్యయనం తేల్చింది. అయితే ఏ వ్యాక్సిన్ను తక్కువ చేసే ఉద్దేశం తమకు లేదని అధ్యయనం బృందం స్పష్టం చేసింది.