మహిళ శరీరంలో 216 రోజుల పాటు కరోనా వైరస్..
posted on Jun 5, 2021 @ 5:34PM
కరోనా ఆ పేరు వింటే చాలు.. వాళ్ళు గగ్గుర్లు పడుతుంది. కరోనా అంటే మరణ వార్త వినాల్సి వస్తుంది. ఇక కరోనా వైరస్ చేయని పని లేదు.. ప్రజలను ఎంత వరకు కుదిపేయ్యాలో అంతవరకు కుదిపేసింది. ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తూ విలయతాండవం చేస్తుంది. పలు దశల్లో విరుచుకుపడుతూ సవాళ్లను విసురుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా పేరు చెబితేనే చాలా మంది జనాలు భయపడిపోతున్నారు. చిన్నపిల్లల ఇంట్లోనే దాక్కుంటున్నారంటే నమ్మండి. ఇది కాగా తాజాగా కరోనా వైరస్ గురించి కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. కానీ ఇప్పటివరకు కరోనా మీద సరైన అవగాహనా ఎవరికి లేదనే చెప్పాలి ఎందుకంటే దాదాపు కరోనా ఎటాక్ చేసి సంవత్సరం పైనే అయింది. ఐన ఆ కరోనా మహమ్మారికి సరైన వైద్యం గాని వాక్సిన్ గాని లేదు.. అప్పుడప్పుడు అసలు కరోనా ఉందా అనే అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే ఇంత టెక్నాలజీ ఉన్నా ప్రపంచంలో అంత చిన్న వైరస్ ఇప్పటికి సరైన వైద్యం లేకపోవడమే అందుకు అనుమానం. అయితే ఈ క్రమంలోనే ఓ షాకింగ్ విషయం బయటికొచ్చింది. షాకింగ్ అంటే అలాంటిలాంటి షాకింగ్ కాదు దక్షిణాఫ్రికాలో 36 ఏళ్ల హెచ్‌ఐవీ పాజిటివ్ మహిళ 216 రోజులు కరోనాతో బాధపడింది. ఈ కాలంలో వైరస్ ఆ మహిళ శరీరంలో 32 సార్లు మ్యూటేషన్ చెందిందని ఓ స్టడీ వెల్లడించింది. దక్షిణ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. మహిళా శరీరంలో వైరస్ స్పైక్ ప్రోటీన్ కూడా 13 సార్లు మ్యూటేషన్ చెందింది. ఇలా జరగడం ద్వారా.. వైరస్ ఆమె శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్‌ను తప్పించుకోగలిగింది. ఇక, వైరస్ మరో 19 మూటేషన్‌లో దాని ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చింది.
అయితే ఆ మహిళ శరీరంలో మ్యూటేషన్ చెందిన వైరస్ ఇతరులకు సోకిందా? లేదా? అనే దానిపై స్పష్టత లేదని Los Angeles Times రిపోర్ట్ చేసింది. ఇక, ఇందుకు సంబంధించిన అధ్యయనం ప్రీ ప్రింట్ జర్నల్ medRxivayలో పబ్లిష్ అయింది. ఈ అధ్యయనానికి సంబంధించిన రచయిత టూలియో డీ ఓలివైరా మాట్లాడుతూ.. ‘ఒకవేళ ఇలాంటివి మరిన్ని కేసులు గుర్తిస్తే.. వైరస్ న్యూ వేరియంట్స్‌కు హెచ్‌ఐవీ సంక్రమణ మూలంగా మారే అవకాశాన్ని పెంచుతుంది. ఎందుకంటే వీరిలో వైరస్ ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి.. అది వైరస్ మ్యూటేషన్ చెందడానికి అవకాశం ఇస్తుంది’ అని తెలిపారు. ఇక, ఆ మహిళకు చికిత్స అనంతరం కూడా కొన్ని లక్షణాలు ఉన్నట్టుగా నివేదికలు సూచిస్తున్నాయి. ఆమె శరీరంలో వైరస్ అలాగే ఉంది. అయితే ఆమె 300 మంది హెచ్‌ఐవీ పాజిటివ్ ప్రజలపై జరిగిన పరిశోధనల్లో ఆమె పాల్గొనడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.