తల్లీకూతుర్లు వేశ్యలుగా.. ఎందుకో తెలుసా ?
posted on Jul 6, 2021 @ 3:47PM
కరోనా ఆ పేరు వింటే ఇప్పుడే కాదు ఎప్పటికి ఒక హడల్ అని చెప్పాలి.. ఇప్పటి వరకు మమల్ని కొట్టే వాడు లేదు అన్న మానవాళికి బోయపాటి సినిమాలో హీరో విలన్స్ కొట్టినట్లు కొట్టడానికి ఒకడు ఒకడు వచ్చాడు వాడే కరోనా అని దాదాపు గత రెండు సంవత్సరాలుగా దాని ప్రతాపం చూపిస్తూ ప్రజలను వణికిస్తుంది.. కరోనా సృష్టించిన విలయం అంత ఇంత కాదు.. కొంత మందిని భయం తో చంపేస్తే.. మరికొంత మందిని కరోనా వైరస్ చంపింది.. కానీ అందరికి ఫైనాన్సియల్ గా దెబ్బతీసింది.. చాలా మంది ఈ ప్యాండమిక్ టైం లో ఉపాధిలేక, ఉన్న జాబ్స్ పోయి రోడ్డున పడ్డారు. కొంత మందికి మూడు పూటల తినడానికి తిండిలేక కడుపు ఎండపెట్టుకుని చనిపోయారు. ఇక ఈ కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది జీవితాలు తల్లకిందులైపోయాయి. ఎందరో ఉద్యోగాలు కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. జీవనోపాధి కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే చిక్కుకున్న ఇద్దరు మహిళలు వాళ్ళ కడుపు నిముకునే మార్గాన్ని ఎంచుకున్నారు. ఎండిన డొక్కలు నింపుకోవడానికి.. అతుక్కుని పోయిని కడుపులో పట్టెడు అన్నం వేసుకునేందుకు వేశ్యలుగా మారిపోయారు. వారిద్దరూ తల్లీకూతుళ్లు కావడం విశేషం.
అది పంజాబ్‌లోని ముక్తాసర్‌కు చెందిన ఓ మహిళ లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయింది. వేరే పనులు ఏమైనా దొరుకుతాయేమోనని ప్రయత్నించింది. ఆమె ప్రయత్నాలు ఆమెను వెక్కిరించాయి.. విధి సైతం ఈ పేదవాడు భూమి మీద బతకకూడదు, నీకు బతికే హక్కులేదు చనిపోమంది.. అలాగే రోజు రోజు ఆమె బతకడానికి ఆమెకు ఆశలు కనబడకపోవడంతో పొట్టకూటి కోసం వేశ్యగా మారింది. అంతేకాదు తన కూతుర్ని కూడా వేశ్యగా మార్చేసింది. తమ ఇంట్లోనే వీరు అసాంఘిక కార్యకలాపాలకు తెరతీశారు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇంటి మీద దాడి చేసిన పోలీసులు తల్లీకూతుళ్లతోపాటు ఇద్దరు విటులను సోమవారం అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టి న్యాయమూర్తి ఆదేశానుసారం చర్యలు తీసుకోనున్నారు
వేశ్య జీవితం గురించి ప్రముఖ తెలంగాణ కవి అలిశెట్టి ప్రభాకర్ గారు ఒక మాట అన్నారు.. తాను శవమై.. ఒకరికి వశమై.. తనువూ పుండై.. ఒకడికి పండై.. ఎప్పుడు ఎడారై.. ఎందరికో ఒయాసిసై.. అని రాశాడు.. ఒక స్త్రీ పడకపంచుకుంటుందంటే కడుపు నిండి కాదు.. కడుపు ఎండి అని తెలుసుకోవాలి.. వాళ్ళు బతకడం కోసం వాళ్ళు ఆ పనిని ఎంచుకున్నారు.. నిజానికి వాళ్ళు కాదు సిగ్గుపడాల్సింది వాళ్ళను ఈ దారుణ స్థితిలోకి తీసుకువచ్చిన ఈ ప్రభుత్వాలది..