ఏపీ లో కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసులు
posted on Apr 11, 2020 @ 7:34PM
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఈ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 402కి చేరింది. గుంటూరులో 14, కర్నూలులో 5, ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున కొత్తగా నమోదయ్యాయి.
గత 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 909 మందికి కొవిడ్-19 పరీక్షలు నిర్వహించగా.. అందులో 37 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.
ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరుగురు మరణించగా.. 11 మంది డిశ్చార్జి అయినట్లు తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 385 ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.