కరుణని కరుణించిన కాంగ్రెస్
posted on Jun 26, 2013 @ 9:57AM
గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న తమిళనాడు రాజ్యసభ ఎన్నికల సస్పెన్స్‌కు కాంగ్రెస్ తెరదించింది.. ఇన్నాళ్లు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుంది అన్న ప్రశ్నలకు సమాధానంగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఎన్నికలలో కరుణానిధి పార్టీ తరుపున నిలబడుతున్న కనిమొలిని బలపరచాలని నిర్ణయించింది.
గత కొద్ది రోజులుగా తన గారాలపట్టి కనిమొళిని గెలిపించుకోవటం కోసం కరుణానిధి అన్ని పార్టీలతో తీవ్రంగా చర్చలు జరిపారు. చివరకు ఆ చర్చలు ఫలించి కాంగ్రెస్ పార్టీ కరుణను కరుణించింది.. రాజ్యసభ ఎన్నికల్లో డియంకె పార్టీ తరుపున నిలబడుతున్న కనిమొళికి తన మద్దతు తెలపనుంది.
కానీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన తరువాత కూడా కనిమొళికి పూర్తి మెజారిటీ మాత్రం రాలేదు.. ఇప్పటికే డియంకె పార్టీకి 23 మంది సభ్యులు ఉండగా, కాంగ్రెస్ నుంచి ఐదుగురు, పిటి నుంచి ఇద్దరు, ఎం ఎం టి నుంచి ఇద్దరు ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు.. అయితే అందరూ కలిసి కూడా 32 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉంది.. రాజ్యసభకు ఎన్నిక అవ్వాలంటే 34 మంది సభ్యుల మద్దతు అవసరం.
ఇప్పటికే కాంగ్రెస్ అనుకోని విధంగా డియంకెకి మద్దతు ఇవ్వటంతో రేపు జరగనున్న ఎలక్షన్స్‌లో ఎవరు గెలుస్తారో అన్నది ఆసక్తిగా మారింది.. మరి కాంగ్రెస్ కరుణించినా కరుణ కల నెరవేరుతుందా, కనిమొళి గట్టుక్కుతుందా చూడాలి..