కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్
posted on Aug 23, 2025 @ 3:21PM
కర్ణాటకలోని చిత్రదుర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్రను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అక్రమంగా బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్నాడని వీరేంద్రపై ఈడీ కేసు నమోదు చేసింది. సిక్కిం రాష్ట్రంలోని గాంగ్‌టక్‌లో ఆయను అదుపులోకి తీసుకుంది. ఎమ్మెల్యే వద్ద నుంచి రూ.12 కోట్ల నగదు, రూ.6 కోట్ల బంగారం, విదేశీ కరెన్సీ ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు నాలుగు వాహనాలను కూడా సీజ్ చేశారు.
ఎమ్మెల్యేకు చెందిన 17 బ్యాంకు అకౌంట్లను, రెండు బ్యాంకు లాకర్లను సెంట్రల్ ఏజెన్సీ ఫ్రీజ్ చేసింది.ఈ దాడులతో- దుబాయ్ కంపెనీలు- దేశంలోని పలు క్యాసినోలతో సంబంధాలు ఉన్న అతి పెద్ద బెట్టింగ్ సామ్రాజ్యం వెలుగులోకి వచ్చినట్టయింది .ఈ నెల 22, 23 తేదీలలో ఈడీ అధికారులు బెంగళూరు, హుబ్లీ, చిత్రదుర్గ, ముంబై, జోధ్‌పూర్, గోవా, గ్యాంగ్‌టక్‌లలో పెద్ద ఎత్తున సోదాలను నిర్వహించారు.
అలాగే- అయిదు ప్రముఖ క్యాసినోలు బిగ్ డాడీ, ఓషన్ రివర్స్, పప్పీస్ ప్రైడ్, ఓషన్ 7, పప్పీస్ గోల్డ్‌లల్లో తనిఖీలు చేపట్టారు. సోదరుడు కేసీ తిప్పేస్వామి డైమండ్ సోఫ్ టెక్, టీఆర్ఎస్ టెక్నాలజీస్, ప్రైమ్9 టెక్నాలజీస్ అనే మూడు దుబాయ్ ఆధారిత సంస్థల ద్వారా బ్యాక్ ఎండ్ నుంచి కార్యకలాపాలను నిర్వహించినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ కంపెనీలన్నీ కూడా గేమింగ్ కాల్ సెంటర్లను నడుపుతూ, అక్రమంగా అంతర్జాతీయ స్థాయిలో మనీలాండరింగ్ చేశాయని ఆరోపణలు ఉన్నాయి.