బండి కాదు జగమొండే కేసీఆర్ టార్గెట్.. రేవంత్‌రెడ్డికి పోటీగా బీజేపీకి బూస్ట్..
posted on Nov 9, 2021 @ 2:33PM
సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుంది. ప్రగతిభవన్‌కు ప్రమాదం పొంచి ఉందని ఫికర్ పట్టుకుంది. అందుకే వరుస ప్రెస్‌మీట్లు పెట్టి గంటల తరబడి చెప్పిందే చెప్పారు. బీజేపీని, కేంద్రాన్ని తిట్టిందే తిట్టారు. బండి సంజయ్ స్థాయిని ఓవర్‌నైట్ పెంచేశారు. కేసీఆర్ ఇంతలా భయపడటానికి కారణం బీజేపీనో, ఈటల రాజేందరో కానే కాదంటున్నారు. రేవంత్‌రెడ్డి భయంతోనే ముఖ్యమంత్రి ఇలా చేస్తున్నారని చెబుతున్నారు. ప్రెస్‌మీట్లు పెట్టి బీజేపీని, బండిని బండకేసి బాదడం.. రేవంత్‌రెడ్డిని సైడ్ చేసేందుకేనని అంటున్నారు. కేసీఆర్ అసలైన టార్గెట్ రేవంత్‌రెడ్డినే కానీ, బీజేపీ కానే కాదని తేల్చేస్తున్నారు.
హుజురాబాద్‌లో గెలిచినంత మాత్రాన, ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు పెరిగినంత మాత్రాన తెలంగాణలో బీజేపీ ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చేంత సీన్ లేదనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఇవాళ అసెంబ్లీని రద్దు చేసి.. రేపు ఎన్నికలు పెట్టినా.. గెలిచేంద సత్తా కాంగ్రెస్‌కు మాత్రమే ఉంది. రాష్ట్రంలో ఇప్పుడంతా రేవంత్‌రెడ్డి మేనియా నడుస్తోంది. కేసీఆర్‌కు కరెక్ట్ మొగుడు రేవంత్‌రెడ్డినే అని ప్రభుత్వ వ్యతిరేకులంతా బలంగా నమ్ముతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ మళ్లీ జవసత్వాలు పుంజుకుంది. కేడర్ ఫుల్ జోష్‌లో ఉంది. ప్రజలు సైతం టీఆర్ఎస్‌కు ఆల్టర్‌నేట్.. కాంగ్రెసేనని ఫిక్స్ అవుతున్నారు. అందుకే, కేసీఆర్‌లో ఇంతటి కలవరింత.
అన్నివర్గాల ప్రజలు కేసీఆర్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చివరాఖరికి రైతులు సైతం వరి వేస్తే ఉరిపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఆ కేసీఆర్ వ్యతిరేకతే.. హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌ను ఓడించి ఈటల-బీజేపీని గెలిపించింది అంటున్నారు. ప్రభుత్వంపై ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో హుజురాబాద్ ఎన్నిక తేల్చేయడంతో.. కేసీఆర్ ఉలిక్కిపడ్డారు. ఈ ప్రజావ్యతిరేకత అంతా వచ్చే ఎలక్షన్‌లో రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ వైపునకే షిఫ్ట్ అవుతుందనే విషయాన్ని గులాబీ బాస్ గ్రహించినట్టున్నారు. అందుకే, రేవంత్‌రెడ్డి దూకుడు ఇలానే కొనసాగితే.. తన ఖేల్ ఖతం.. దుకాణం బంద్ అవుతుందనే భయంతో.. వెంటనే ఆపరేషన్ బీజేపీ అమల్లో పెట్టారని అంటున్నారు.
బండి సంజయ్‌ది తన స్థాయి కాదని వదిలేశానంటూ.. రెండు ప్రెస్‌మీట్లూ బండి సంజయ్ చుట్టూనే తిప్పేశారు. బండి సంజయ్‌ను తన స్థాయి లీడర్‌ను చేసేశారు. ఇక కేసీఆర్ వర్సెస్ బండి సంజయ్.. కేసీఆర్ వర్సెస్ బీజేపీ.. కేసీఆర్ వర్సెస్ కేంద్రం.. అనేలా డ్రామా రక్తి కట్టించారు. విమర్శలన్నీ బీజేపీ బండి చుట్టూనే తిరిగినా.. కేసీఆర్ మెయిన్ టార్గెట్ మాత్రం రేవంత్‌రెడ్డి-కాంగ్రెస్‌లే. ఒక్క హుజురాబాద్ విషయం వదిలేస్తే.. కొన్ని నెలలుగా కేసీఆర్‌కు, కేటీఆర్‌కు నిద్ర పట్టకుండా చేస్తున్నారు రేవంత్‌రెడ్డి. దళిత-గిరిజన దండోరాలు, డ్రగ్స్ దందాలో వైట్ ఛాలెంజ్‌లు, పదునైన విమర్శలతో రెచ్చిపోతున్నారు రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్ శ్రేణుల్లో మునుపటి ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఇప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ కేడర్ బలంగానే ఉంది. రేవంత్‌రెడ్డి జోరు ఇలానే కొనసాగితే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ అధికారం హస్తగతం చేసుకునేలా కనిపిస్తోందని అంటున్నారు.
అసలే ఫైర్ బ్రాండ్ లీడర్ అయిన బండి సంజయ్.. కేసీఆర్ తనను అన్నేసి మాటలు అంటే చూస్తూ ఊరుకుంటారా? ఆయనా రెచ్చిపోయారు. పోటాపోటీ ధర్నాలతో ఇటు టీఆర్ఎస్.. అటు బీజేపీ రెండు పార్టీలూ కలిసి రచ్చ రంభోలా చేస్తున్నారు. ఈ రాజకీయ ఉద్రిక్తతలో రేవంత్‌రెడ్డి-కాంగ్రెస్ సైడ్ వేస్‌లోకి వెళ్లిపోతారనేది కేసీఆర్ స్కెచ్ అంటున్నారు. మరి, ముఖ్యమంత్రి మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా? రేవంత్‌రెడ్డిని సైడ్ చేయడం అంత ఈజీగా? జిత్తులమారి కేసీఆర్‌ను.. జగమొండి రేవంత్‌రెడ్డి ఎలా డీల్ చేస్తారో చూడాలి...