లేడీ డ్యాన్సర్ అనుమానాస్పద మృతి.. అర్థనగ్నంగా డెడ్‌బాడీ..
posted on Nov 9, 2021 @ 3:12PM
ఆమె పేరు ఫాతిమా(30). ఓ ఆర్కెస్ట్రా ట్రూప్‌లో డ్యాన్సర్. అదే ఆమెకు జీవనాధారం. చాలా ఏళ్లుగా డ్యాన్సర్‌గా పని చేస్తున్నారు. ఓల్డ్‌సిటీ ఏరియాలో కాస్తోకూస్తో గుర్తింపు ఉంది. అందంగానూ ఉంటుంది. కట్ చేస్తే.. ఇంట్లోనే ఆమె చనిపోయి పడి ఉంది. డెడ్‌బాడీ అర్థనగ్నంగా ఉంది. మృతదేహం పక్కన మద్యం బాటిల్ పడుంది. గొంతు నులిమిన ఆనవాళ్లు కూడా కనిపించాయి. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆమెది హత్యా? హత్యాచారం కూడానా? అనే దిశగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఫాతిమా మృతి కేసు స్థానికంగా కలకలంగా మారింది.
హైదరాబాద్ పూల్‌బాగ్‌కు చెందిన షీరిన్ ఫాతిమా(30) భర్త నదీమ్ గత ఏడాది చనిపోయారు. వారికి ఆరుగురు కూతుళ్లు, ఒక కుమారుడు. ఇటీవల ముస్తఫానగర్‌కు మకాం మార్చింది ఫాతిమా. అయితే, పాత ఇంట్లో కొన్ని సామాన్లు సర్దాలంటూ పిల్లలను పుట్టింట్లో వదిలి పూల్‌బాగ్ వచ్చింది. రాత్రైనా ఆమె ఇంటికి రాకపోవడంతో పిల్లలు తల్లిని వెతుక్కుంటూ ఆ ఇంటికి వెళ్లారు. అక్కడికి వెళ్లేసరికి ఆ ఇంట్లో విగతజీవిగా పడుంది ఫాతిమా. ఒంటిపై బట్టలు సరిగా లేవు. అర్థనగ్నంగా ఉంది. ఫలక్‌నుమా పోలీసులకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా ఫాతిమా ఎలా చనిపోయిందో.. హత్యాచారం జరిగిందో లేదో తేల్చనున్నారు పోలీసులు.