ఎమ్మెల్సీలు వద్దు.. స్కూళ్లు కావాలా?.. కేసీఆర్ డబుల్ గేమ్‌కు రీజనేంటి?
posted on Aug 24, 2021 @ 1:21PM
జస్ట్ 119 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఓటింగ్‌లో పాల్గొంటారు. ఎమ్మెల్సీలను ఎన్నుకుంటారు. తక్కువ మందే కాబట్టి పక్కా ఏర్పాట్లు చేయొచ్చు. చాలా సింపుల్‌గా, సురక్షితంగా ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి చేయొచ్చు. కానీ, అందుకే కేసీఆర్ సర్కారు ససేమిరా అంటోంది. ఈసీ ప్రభుత్వ అభిప్రాయం కోరితే.. నాట్ పాజిబుల్ అంటూ రిప్లై ఇచ్చింది. కరోనానే అందుకు సాకుగా చూపించింది. కేవలం 119 మంది విషయంలోనే కొవిడ్ భయ ఉందంటే.. మరి లక్షలాది విద్యార్థులు హాజరయ్యే స్కూల్స్, కాలేజెస్‌ను తెరవడానికి ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు? ఒకే గదిలో పదుల సంఖ్యలో కూర్చొనే విద్యార్థులకు లేని ముప్పు.. ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించడానికి ఏముంటుంది? ఇదంతా కేసీఆర్ ఆడుతున్న రాజకీయ డ్రామానా? లేక, గులాబీ బాస్‌కు హుజురాబాద్ గుబులా? అనే చర్చ మరోసారి రసవత్తరంగా మారుతుంది.
సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణలో అన్ని రకాల విద్యాసంస్థలు రీఓపెన్ కానున్నాయి. అందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హమ్మయ్యా.. అంటూ తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇంట్లో పిల్లల పోరు పడలేక.. స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయనే మాట వినగానే సంబరపడిపోతున్నారు. ఇక లక్షలాది మంది స్టూడెంట్స్ ఇళ్లు విడిచి స్కూల్స్‌కి, కాలేజీలకు క్యూ కట్టనున్నారు. అయితే, తాజాగా సెప్టెంబర్‌లోనే థర్డ్ వేవ్ ముంచుకువస్తుందని.. రోజుకు 5 లక్షల వరకూ కేసులు వస్తాయని.. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన నీతి ఆయోగ్, ఎన్ఐఎమ్‌డీలు గట్టిగానే హెచ్చరిస్తున్నాయి. ఈసారి పిల్లలపైనే అధిక ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. స్టూడెంట్స్‌లో ఒక్కరు కొవిడ్ బారిన పడితే.. వైరస్ వేగంగా అందరినీ చుట్టేసే ప్రమాదం పొంచిఉంది. స్కూల్స్‌లో సానిటైజేషన్, సోషల్ డిస్టాన్సింగ్ అంత ఈజీ కాకపోవచ్చు. ఇలా థర్డ్ వేవ్ ముప్పు ఇంత పక్కాగా కనిపిస్తున్నా.. కేసీఆర్ సర్కారు మాత్రం ఇప్పటికిప్పుడు అర్జెంటుగా సెప్టెంబర్‌లోనే స్కూల్స్, కాలేజేస్ తెరవడంపై ఆందోళన సైతం వ్యక్తమవుతోంది. మరో నెల వరకూ వేచి చూసి అప్పుడు నిర్ణయం తీసుకుంటే బాగుండేదనే నిపుణుల అభిప్రాయం.
మరోవైపు.. కొవిడ్‌తో కేసీఆర్ ఆడుతున్న పొలిటికల్ గేమ్ సైతం విమర్శల పాలవుతోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలకు కరోనాను కారణంగా చూపి మోకాలొడ్డుతుండటాన్ని అంతా తప్పుబడుతున్నారు. టీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీ ఆశావహులు, అసంతృప్తులు చాలా మంది ఉండటం వల్లే.. ఒకరికిస్తే మరొకరు పార్టీ వీడే ప్రమాదం ఉండటం వల్లే.. ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌కి కొవిడ్ కొర్రీలు పెడుతున్నారని మండిపడుతున్నారు. ఎమ్మెల్సీ అసంతృప్తులు పార్టీని వీడితే.. ఆ ప్రభావం హుజురాబాద్ ఎన్నికల మీద పడుతుందని ఆ భయంతోనే కేసీఆర్ అలా చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఇక, ఎమ్మెల్సీ ఎన్నికలు జరిపితే.. ఆ వెంటనే హుజురాబాద్ ఎలక్షన్ కూడా నిర్వహించేందుకు ఈసీ రెడీ అవుతుంది. ఇప్పటికిప్పుడు హుజురాబాద్‌లో ఉప పోరు జరిగితే ఈటల రాజేందర్‌దే గెలుపని కేసీఆర్ చేయించిన సర్వేలు చెబుతున్నాయి. హుజురాబాద్ వార్ ఎంత ఆలస్యం అయితే అంత టీఆర్ఎస్ లాభమని.. అందుకే ఆ ఎన్నికలను ఆలస్యం చేయడానికే ఎమ్మెల్సీ ఎలక్షన్ నిర్వహించలేమంటూ ఈసీకి లేఖ రాసినట్టు తెలుస్తోంది. మొత్తానికి సీఎం కేసీఆర్‌కు.. ఈటల రాజేందర్ భయం బాగానే పట్టుకున్నట్టుంది. ఆయన గెలుపును ఆలస్యం చేయడానికే ఎమ్మెల్సీ కిరికిరి పెడుతున్నారని అంటున్నారు. 119 ఎమ్మెల్యేలు ఓటేస్తేనే ప్రమాదం అన్నప్పుడు.. లక్షలాది మంది విద్యార్థులు హాజరయ్యే విద్యాసంస్థలకు కొవిడ్ వర్రీ ఉండదా? స్కూల్స్, కాలేజేస్ రీఓపెన్‌కి ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో కేసీఆర్‌కే తెలియాలి. ఎమ్మెల్యేలకు ఓ రూల్? స్టూడెంట్స్‌కు ఇంకో రూలా?