సీఎం పదవికి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా?
posted on Aug 24, 2012 @ 1:29PM
సీఎం సీటు మారబోతోందా..? కిరణ్ కుర్చీకి ఎసరొచ్చేసిందా..? అవునంటున్నారు.. రాష్ట్ర రాజకీయాల్లో తలపండిన నేతలు. ఇప్పటికే ఉన్న సమాచారం నిజమైతే.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్ఠానానికి తన రాజీనామా సమర్పించినట్టే. హై కమాండ్ ఆయన రాజీనామాని ఆమోదించడమే తరువాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కోసం అధిష్ఠానం దగ్గర ఇప్పటికే సీమాంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలనుంచి నలుగులు అభ్యర్థుల బయోడేటాలు రెడీగా ఉన్నాయి. కొద్ది కాలంగా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితిపై తీవ్ర అసంతృప్తితోఉన్న అధిష్ఠానం సీఎం అభ్యర్థిని మార్చాలన్న నిర్ణయానికొచ్చిందని, దాని పర్యవసానమే హస్తినలో ప్రస్తుతం భారీగా జరుగుతున్న కసరత్తని రాజకీయవర్గాలు కోడైకూస్తున్నాయి.