సుప్రీం కోర్టు తీర్పు పై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తా : సుబ్రమణ్యం స్వామి
posted on Aug 24, 2012 @ 3:10PM
2జి కుంభకోణంలో ప్రధాన నిందితునిగా చిదంబరాన్ని చేర్చాలని కోరుతూ సుబ్రమణ్యం స్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు త్రోసిపుచ్చింది. అయితే కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయదలచినట్టు సుబ్రమణ్యం స్వామి వెల్లడించారు. సుప్రీం కోర్టు తీర్పు వెలువడుతూనే సుబ్రమణ్యం స్వామి ఆగ్రహంతో కోర్టు బయటకు వచ్చి తమ ఆక్షేపణను మీడియా ప్రతినిధుల ముందు వ్యక్తం చేశారు. ఇది చెడ్డ తీర్పు అని కూడా వ్యాఖ్యానిస్తూ, కోర్టు తీర్పు ప్రతి అందిన తర్వాత మిగిలిన విషయాలను మాట్లాడతానని ఆయన అన్నారు. తాను అసలు కుట్ర అనే మాటను వాడలేదని, అటువంటప్పుడు కోర్టు ఆ మాటతో తన కేసును ఎలా త్రోసిపుచ్చుతుందని ఆయన ఆవేశంతో ప్రశ్నించారు.