మళ్లీ ప్రధాని.. చంద్రబాబు అభినందనలు
posted on Sep 12, 2015 @ 5:38PM
ఒకటి కాదు రెండు కాదు దాదాపు కొన్ని సంత్సరాల నుండి ఎన్నికల్లో పోటీ చేస్తూ అప్పటి నుండి గెలుస్తూనే ఉంది సింగపూర్ లోని పీపుల్స్ యాక్షన్ పార్టీ. 1965లో ఏర్పాటైన ఈపార్టీ అప్పటినుండి ఇప్పటివరకూ గెలవడం ఆశ్చర్యకరమైన విషయమే. ఒక్కసారి గెలవడమే కష్టం అనుకుంటున్న రోజుల్లో ఈ సారి కూడా ఈ పార్టీ విజయఢంకా మోగించింది. మొత్తం 89 సీట్లకు గాను 83 సీట్లు గెలిచి ఈసారి కూడా లిసీన్ లూంగ్ మళ్లీ ప్రధానిగా ఎంపికయ్యారు. అయితే ఈసారి కూడా లూంగ్ ప్రధాని కావడంతో ఏపీలో టీడీపీ నేతలు పండగ చేసుకుంటున్నారు. ఆయన ప్రధాని అయితే ఇక్కడ వీళ్లు చేసుకోవడం ఏంటనుకుంటున్నారా.. ఎందుకంటే ఏపీ అభివృద్ది దిశగా సింగపూర్ పర్యటించిన చంద్రబాబు అక్కడ పారిశ్రామిక వేత్తలతో మాట్లడటానికి.. పెట్టుబడులు పెట్టడానికి లూంగ్ ఎంతగానో సహకరించారు. ఈ నేపథ్యంలో లూంగ్ మళ్ళీ ప్రధానిగా నియమించబడటం అక్కడ సంగతేమో కాని ఇక్కడ ఏపీకి మాత్రం ఒక రకంగా తీపి కబురు లాంటిదే. అందుకే లూంగ్ ప్రధానిగా ఎన్నికైన నేపథ్యంలో చంద్రబాబు కూడా తనను అభినందిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
లూంగ్ నాయకత్వంపై నమ్మకం ఉంది కాబట్టే సింగపూర్ ప్రజలు మళ్లీ అతనిని ప్రధానిని చేశారని కొనియాడారని ట్విట్టర్ లో పేర్కొన్నారు..