ఏపీ ప్రత్యేక హోదా.. వారంలో ఏదో ఒకటి తేల్చేస్తాం.. జైట్లీ

 

ఏపీ ప్రత్యేక హోదా పై ఇప్పటికీ వస్తుందా రాదా అనే సందేహాలే ఉన్నాయి అందరిలో. దీనిలో భాగంగానే ఇప్పటికే అధికార పక్షం కానీ.. ప్రతి పక్షాలు కానీ నిరసనలు చేస్తూనే ఉన్నారు. గతంలో సీఎం చంద్రబాబు ప్రధాని మోడీ మధ్య ప్రత్యేక హోదా గురించి చర్చ జరిగినా అప్పుడు కూడా దానిపై స్పష్టత రాలేదు. అయితే దీనికి సంబంధించి వారం రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చెప్పడం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన ముగించుకొని అనంతరం ఢిల్లీలోని కేంద్రమంత్రులను కలిసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే ఆయన కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరువురు ఏపీ ప్రత్యేక హోదా గురించి చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా చంద్రబాబు విభజన చట్టంలో ఏపీకి ఇస్తానన్న అంశాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని... జాప్యమయ్యేకొద్ది రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతోందని వివరించారు. దీనికి జైట్లీ ఏపీ ప్రత్యేక హోదాపైన.. ప్రత్యేక ప్యాకేజ్ పైన అటో ఇటో తేల్చేస్తామని.. వారం రోజుల్లో ఏదో ప్రకటన చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Teluguone gnews banner