ఇచ్చినమ్మ వాయినం.. పుచ్చుకుంటినమ్మ వాయినం చందాగా మోడీ
posted on Sep 24, 2015 @ 6:08PM
ప్రధాని నరేంద్ర మోడీ బిజీబిజీగా విదేశాల పర్యటన చేస్తున్నారు. ఈ పర్యటనల వల్ల దేశానికి వచ్చే లాభం ఎంత ఉందో తెలియదు కాని ఇప్పుడు ప్రధాని పర్యటన అనగానే ఆయన అక్కడి ప్రధానికి ఏం బహుమతి తీసుకెళుతున్నారు.. వారు ప్రధానికి ఏం బహుమతి ఇస్తున్నారు అనే విషయ తెలుసుకోవడంపై ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే ఆయన విదేశీ పర్యటనలకు వెళ్లేప్పుడు ఒట్టి చేతులతో వెళ్లరు. ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో ఉన్న మోడీకి అక్కడి ప్రభుత్వం ఘన స్వాగతం అందించింది. అనంతరం ప్రధాని మోడీ ఐర్లాండ్ ఎండా కెన్నికి విలువైన పత్రాల్ని అందించారు. దీనికి ప్రధాని కెన్ని మోడీకి ఆదేశ జాతీయ క్రీడ అయిన హర్లింగ్ బ్యాట్.. బంతి.. జెర్సీలను బహుమతులుగా అందించారట. అంతేకాదు ఐర్లాండ్ పర్యటనతో మోడీ అరుదైన ఘనత కూడా దక్కింది. దాదాపు 60 ఏళ్ల తరువాత భారత ప్రధాని ఐర్లాండ్ లో పర్యటించండం ఇదే. ఈ విషయాన్ని దౌత్య వర్గాలు కూడా ఘనంగా ప్రకటించారు. మొత్తానికి మోడీ బహుమతులు ఇచ్చిపుచ్చుకునే కాన్సెప్ట్ బాగానే ఉందని అనుకుంటున్నారు.