మోదీ ఫోన్ చేశారు.. 15 తర్వాత రమ్మన్నారు.. చంద్రబాబు
posted on Aug 13, 2015 @ 12:55PM
ఏపీ ప్రత్యేక హోదాపై ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడుతున్నారు. ఇప్పటికే కేంద్ర ఏపీకీ ప్రత్యేక ఇవ్వడం కుదరదని చెప్పింది. దీంతో ఏపీలో ఆందోళనలు, నిరసనలు మొదల్యయ్యాయి. మరోవైపు ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వాలని మునికోటి ఆత్మహత్యతో ఈ వివాదం ఇంకా ముదిరింది. కొంత మంది నేతలు ఏపీకి ప్రత్యేక హోదా రాదు అని కుండ బద్దలు కొట్టినట్టు చెపుతుంటే మరోవైపు కొంతమంది నేతలు ఏపీకి ప్రత్యేక హోదాకోసం తప్పకండా పోరడతామని.. ఎలాగైనా ప్రత్యేక హోదా సాధించి తీరుతామని చెపుతున్నారు. ఈ మాటలకు అందరి పరిస్థితి ఎలా ఉన్నా ఏపీ ప్రజల పరిస్థితే అయోమయంలో పడింది.
దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు కూడా కేంద్రం పై మండిపడినట్టు వార్తలు వినిపించాయి. దీనిలో భాగంగానే చంద్రబాబు ‘ప్రత్యేక హోదా విషయంలో ఏం జరుగుతుందో ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత నాపై ఉందని అన్నారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరలతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా గురించి ప్రధాని మోదీ తనకు ఫోన్ చేసి మాట్లాడారని.. అప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా విషయం గురించి చెప్పానని.. రాష్ట్రంలోని సమస్యలు గురించి ఆయనకు వివరించానని.. ఆయనకు ఆయనకు నా ఆవేదన తెలియజేశానని చెప్పారు. ఈ నెల 15 తర్వాత ఢిల్లీకి రమ్మన్నారని.. కూర్చుని మాట్లాడుకుందాం’ అని మోదీ అన్నారని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక్క సమస్య గురించే కాదని అనేక సమస్యల గురించి ప్రధానితో కాని.. కేంద్ర మంత్రులతో కాని చర్చిస్తునే ఉన్నానని చెప్పారు. కొంతమంది ప్రత్యేక హోదా ఒక్కటే వస్తే చాలని మభ్య పెడుతున్నారని, కానీ అదొక్కటే వస్తే సరిపోదని, విభజన బిల్లులో పేర్కొన్నవన్నీ సాధించుకోవాల్సి ఉందన్నారు.