చెత్త నుంచి సంపద సృష్టించొచ్చు : సీఎం చంద్రబాబు
posted on Aug 23, 2025 @ 5:41PM
పేదలపై పన్ను భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. కాకినాడ జిల్లా, పెద్దాపురంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా స్వచ్ఛతా ర్యాలీలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. సీఎంతో పాటు ర్యాలీలో ప్రజాప్రతినిధులు, మెడికల్ విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం అక్కడి మ్యాజిక్ డ్రెయిన్లను చంద్రబాబు పరిశీలించారు. వాటి నిర్మాణం, ఉపయోగం గురించి పారిశుధ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వీటి ద్వారా భూగర్భ జలాల పెరుగుదలతో పాటు పారిశుధ్య నిర్వహణ భారం కూడా తగ్గుతుందని కార్మికుల వివరించారు.
గత వైసీపీ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పూర్తిగా విస్మరించిందని, కలుషిత నీటితో ప్రజలు రోగాల బారిన పడ్డారని ఆయన అన్నారు. స్వచ్చమైన నీరు, పరిశుభ్రమైన వాతవరణం కల్పించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన చెత్తపన్ను విధానంపై కీలక వ్యాఖ్యలు. జగన్ హయాంలో చెత్తకు పన్ను వేశారని, కానీ తీయలేదని ఎద్దేవా చేశారు అన్ని మున్సిపాలిటీల్లోని చెత్తా చెదారాన్ని అక్టోబర్ 2 నాటికి తొలగిస్తామని సీఎం స్పష్టం చేశారు.
ప్రపంచంలో ఏదీ వేస్ట్ కాదని, చెత్తతో కూడా సంపద సృష్టించొచ్చని చెప్పారు. ప్రజల ఆలోచనా విధానం మారాలని అప్పుడే స్వర్ణాంధ్ర సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. సంపద సృష్టించడం.. ఆదాయాన్ని పెంచడం మాకు తెలుసు. అప్పులతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తే దీర్ఘకాలం కొనసాగదు. నేను సూపర్ సిక్స్ అంటే సాధ్యం కాదన్నారు.. చేసి చూపించామని సీఎం చంద్రబాబు తెలిపారు.
సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యింది. అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఎప్పటికప్పుడు వారి ఖాతాల్లో నగదు జమచేస్తున్నామని పేర్కొన్నారు.పెద్దాపురంలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు. అమరావతి మునిగిపోయిందని వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. అమరావతికి నిధులు ఇవ్వొద్దని అందరికీ లేఖలు రాశారు. ప్రపంచంలోనే గొప్ప నగరంగా అమరావతిని తయారు చేస్తామన్నారు. అమరావతి, విశాఖ, తిరుపతిని మహానగరాలుగా మారుస్తాం. పెట్టుబడులు పెట్టేందుకు వస్తే ఎవరైనా ఆహ్వానిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.