50 శాతం మూగబోయిన టీ.వీ.లు
posted on Apr 2, 2013 9:18AM
జంటనగరాలలో 50 శాతం పైగా టీ.వీ.లు మూగబోయాయి. సోమవారం ఉదయం జంటనగరాలలో అనలాగ్ ప్రసారాలను సిటీకేబుల్, హాత్ వె నిలిపివేశారు. హైదరాబాద్ పలక సంస్థ పరిథిలో దాదాపు 25 లక్షల టీవీలు ఉన్నాయని ఎం.ఎస్.ఓ. లు వెల్లడించారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిథిలో 8.96 లక్షల ఇళ్లలో టీవీలు ఉన్నాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ లెక్కలు వేసింది. 10 లక్షలకుపైగా టీవీలకు సెట్ టాప్ బాక్స్, డి.టి.హెచ్. కనెక్షన్ లు ఉన్నాయనే భావనతో పైగా డిజిటలైజేషన్ పూర్తయిందని కేంద్రం ప్రకటించింది. సిటీకేబుల్, హాత్ వె ప్రసారాలను నిలిపివేయడంతో ప్రజలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో సోమవారం ఉదయం ప్రసారాలు ప్రారంభించాయి. సమాచార, ప్రసార శాఖ పరిథిలో కేబుల్ డిజిటలైజేషన్ ను పర్యవేక్షిస్తున్న బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులు (బేసిల్) కేబుల్ కార్యాలయాలకు వచ్చి ప్రసారాలు నిలిపివేయించారు. మరో 30-45 రోజుల గడువిస్తే అందరికీ సెట్ టాప్ బాక్స్ లు అమర్చగలమని ఎం.ఎస్.ఓ. ప్రతినిధి బేసిల్ ప్రతినిథులకు తెలపడంతో వారు ఈ విషయాన్ని నాట్ చేసుకుని వెళ్ళిపోయారు. దీంతో జంటనగరాలలోని 50 శాతం పైగా టీ.వీ.లు మూగబోయాయి. ప్రభుత్వం దీనిపై తొందరలోనే ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.