కిరణ్ కు చంద్రబాబు సవాల్ ...
posted on Apr 2, 2013 8:21AM
ఎవరి హయాంలో విద్యుత్తు వ్యవస్థ మెరుగ్గా వుందో, ఎవరి హయాంలో విద్యుత్ వ్యవస్థ భ్రష్టుపట్టిపోయిందో చర్చ జరగాల్సిన అవసరం ఉందని , దీనిపై చర్చించడానికి కిరణ్ కుమార్ రెడ్డికి ఉందా అని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. 1994 నుండి 2013వరకు విద్యుత్ వ్యవస్థపై రాష్ట్రంలో చర్చ జరగాల్సిందేనని, మా హయాంలో 25 నుంచి 30పైసలు పెంచితే నానా రాద్ధాంతం చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 35వేల కోట్ల రూపాయలు పెంచిందని, దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. 2009 ఎన్నికల్లో 2014 వరకు విద్యుత్ ఛార్జీలు రూపాయి కూడా పెంచమని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ళలోనే మూడుసార్లు పెంచారని, 2004లో తమ ప్రభుత్వ హయాంలో మిగులు విద్యుత్ ను సాధించామని, 2009కు ముందు 70శాతం పీ.ఎల్.ఎఫ్.పై గ్యాస్ ప్లాంట్లు పనిచేసేవని ఇప్పుడు 24శాతం పి.ఎల్.ఎఫ్.పై పనిచేసే దుస్థితి ఏర్పడిందని తన తరువాత వచ్చిన ముఖ్యమంత్రుల అవినీతి వల్లే విద్యుత్ రంగం పూర్తిగా నాశనమైందని అన్నారు. అందుకే విద్యుత్ వ్యవస్థను ఎవరు భ్రష్టుపట్టించారో చర్చలో తేలిపోవాలి అని చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ కు నేరుగా సవాల్ విసురుతున్నారు.