ప్రతి అడ్డమైన వాడికీ అమెరికా ఒకటి దొరికింది!
posted on Jun 5, 2024 @ 10:50AM
ఇండియాలో అడ్డమైన పాపాలు చేయడం.. ఆ పాపాలకు పరిహారం అనుభవించే సమయానికి ఏదో ఒక సాకు చెప్పి అమెరికాకి పారిపోవడం... ఈ మధ్యకాలంలో ప్రతి అడ్డమైన వాడికీ అమెరికా ఒకటి దొరికింది! తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వున్నంతకాలం ఎంచక్కా ఫోన్ ట్యాపింగ్ చేసిన మాజీ పోలీస్ అధికారి, ఎస్.ఐ.బి. మాజీ చీఫ్ ప్రభాకరరావు, కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత హాయిగా అమెరికా పారిపోయాడు. క్యాన్సర్ వచ్చింది, మోకాల్లో బ్రెయన్ వాచింది.. అంటూ కారణాలు చెబుతూ అక్కడే సెటిలై, ఇక్కడి అధికారులతో వాట్సప్‌లో టచ్‌లో వుంటున్నాడు. అలాగే ఏపీలో జగన్ బూట్లు నాలుక అరిగిపోయేలా నాకిన ఆంధ్రప్రదేశ్ అడిషనల్ అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చంద్రబాబు మీద అక్రమ కేసులు పెట్టి వేధించి, ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చే సమయానికి అమెరికాలో సెటిలైపోయి, రోజూ పీకల్దాకా మందు కొడుతూ, నోటికొచ్చినట్టు వాగుతూ టైమ్ పాస్ చేస్తున్నాడు. అలాగే పంచ్ ప్రభాకర్ లాంటి పిచ్చికుక్క అమెరికాలో సెటిలైపోయి తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడి మీద అరుస్తూ బతికేస్తోంది. పంచ్ ప్రభాకర్ లాంటి పిచ్చికుక్కలు చాలానే అమెరికాలో సెటిలై వున్నాయి. ఇప్పుడు తాజాగా మరో వేస్టుఫెలో అమెరికా పారిపోయే ప్రయత్నాల్లో వున్నాడు. అతగాడే సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్!
జగన్ రాక్షస ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడి మీద, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల మీద తప్పుడు కేసుల నమోదులో అత్యంత కీలకంగా వ్యవహరించిన వ్యక్తి సంజయ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడంతో సంజయ్ కూడా అమెరికా పారిపోయే ప్రయత్నాలు మొదలుపెట్టేశాడు. తన వ్యక్తిగత కారణాలతో అమెరికా వెళ్తానంటూ ఈయనగారు దరఖాస్తు చేసుకోగానే, జగన్ బూట్లు నాకిన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వెంటనే అనుమతి ఇచ్చేశారు. మరి ఈయన తిరిగి వస్తాడో, సంపాదించిన కోట్ల డబ్బుతో అమెరికాలోనే ఎంజాయ్ చేస్తూ బతికేస్తాడో!