వామ్మో.. ఈ నెల 8 న భూమి పైకి చైనా రాకెట్..
posted on May 6, 2021 @ 11:15AM
దాదాపు ఒకటిన్నర సంవత్సర కాలం నుంచి. కరోనా కారణంగా ప్రపంచదేశాలు చైనా దేశం మీద గుర్రుగా ఉన్నాయి. కరోనాకు సంబందించిన వాస్తవాలు అవాస్తవాలు పక్కన పెడితే. మళ్ళీ ఇప్పుడు ప్రపంచదేశాలు అన్నీ మరోసారి చైనా గురించి ముక్కుమ్మడిగా మాట్లాడుకుంటున్నాయి. ఇంతకీ చైనా రాకెట్ గురించే చర్చ జరుగుతోంది. ఇంతక ఆ రాకెట్ వల్ల ఏం జరుగుతుంది. ప్రపంచం పైన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది. అనే ఆందోళన ప్రపంచదేశాల్లో నెలకొంది. చైనా ప్రయోగించిన ఓ రాకెట్ అదుపుతప్పింది. నియంత్రణ కోల్పోయి భూమి వైపు దూసుకొస్తోంది. ఐతే అది జనావాసాల్లో కూలిపోయే అవకాశముందన్న అంచనాల నేపథ్యంలో మిగతా దేశాలు కలవరపడుతున్నాయి. చైనా సొంతంతా అంతరిక్ష కేంద్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గత వారం లాంగ్ మార్చ్ 5బీ (Long March 5b) అనే పెద్ద రాకెట్‌ను ప్రయోగించింది. అంతరిక్ష కేంద్రం కోర్ మాడ్యూల్‌ను అది విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్లింది. అనంతరం నియంత్రణ కోల్పోవడంతో తిరిగి భూమిపై కూలుతుందని అంతరిక్ష నిపుణులు విశ్లేషించారు.
లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ శకలాలు సముద్ర జలాల్లో కాకుండా సాధారణ భూభాగంపై పడిపోయే ముప్పుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మే 8న రాకెట్ శకలాలు భూవాతావరణంలోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు. ఆ రాకెట్ ప్రయాణ మార్గాన్ని ఎప్పటికప్పుడు యూఎస్ స్పేస్ కమాండ్ పరిశీలిస్తోందని అమెరికా రక్షణ విభాగం అధికార ప్రతినిధి మైకో హోవర్డ్ వెల్లడించారు. ఐతే భూవాతావరణంలోకి ఏ ప్రాంతంలో ప్రవేశిస్తుంది? ఎక్కడ కూటిపోతుంది? అనేది ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు. భూ వాతావరణంలోకి ప్రవేశించే కొన్ని గంటల ముందు మాత్రమే స్పష్టత వస్తుందని.. అప్పటి వరకూ ఏమీ చేయలేమని స్పష్టం చేారు.
ఐతే రాకెట్ భూమిపై కూలినప్పటికీ పెద్దగా నష్టముండదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. భూమిపైకి చేరేలోపే.. భూవాతావరణ ఒత్తిడికి ఆ శకాలన్ని కాలిబూడిదయ్యే అవకాశముందని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు. మరికొందరు మాత్రం నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. భూమి వైపు దూసుకొస్తున్న లాంగ్ మార్చ్ రాకెట్ బరువు 22 టన్నుల వరకు ఉంటుంది. అంత భారీ రాకెట్ భూమి వైపు వస్తున్నప్పుడు... పెద్ద పెద్ద విడిభాగాలు భూమిపై అలాగే పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఆ రాకెట్ శకలాలు భూమిని తాకితే చిన్న విమానం కూలినట్లుగా ఉంటుందని వెల్లడించారు. రాకెట్ శకలాలు సముద్రంలోనే పడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ఎక్స్‌పర్ట్ జొనాథన్ మెక్‌డోవెల్ పేర్కొన్నారు. జనావాసాలపై కూలే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వెల్లడించారు.
గత ఏడాది కూడా చైనాకు చెందిన రాకెట్ కూలిపోయిన విషయం తెలిసిందే. చైనా తొలిసారి లాంగ్‌మార్చ్ 5బిని ప్రయోగించినప్పుడు దాని శకలాలు నేరుగా భూమిపై కూలిపోయాయి. ఐవరీ కోస్ట్‌లోని జనవాసాల్లో పడడంతో పలు గ్రామాల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి. స్కైలాబ్ తర్వాత భూమిపై కూలిన అతి పెద్ద రాకెట్ అదేనని అప్పట్లో అంతరిక్ష రంగ నిపుణులు తెలిపారు.1979లో ఆస్ట్రేలియాలోని ఎస్పెరాన్స్ సముద్ర జలాల్లో స్కైలాబ్ కూలిపోయిన విషయం తెలిసిందే. గతంలో చైనా కరోనా ప్రపంచదేశాలనే వాణికించిందని ఇప్పుడు ఈ రాకెట్ ఏంచేస్తుందో అని ప్రపంచదేశాలు వాపోకుండా ఉండలేకుడా పోతున్నాయి. చూద్దాం ఈ నెల 8 న ఏం జరుగుతుందో..