క్యాబినేట్ మార్చక్కర్లేదు నామినేటెడ్ పోస్టులిస్తేచాలు

ముఖ్యమంత్రి డిల్లీలో జరిపిన సుడిగాలి పర్యటనలో ఖరారయిన విషయం ఏమంటే ఇప్పుడున్న క్యాబినేట్ ను  మార్చనక్కర్లేదని, నామినేటెడ్ పోస్టులిస్తేచాలంటూ 45 పేర్లను  తమ వెంట తీసుకెళ్లారు. మొదట గులాంనబీ ఆజాద్ ను కలుసుకున్నారు. రాష్ట్రరాజకీయాలను ఏకరువు పెట్టారు. సోనియా గాంధీతో గంటకు పైగా చర్చలు జరిగాయి.  ముఖ్యమంత్రివద్ద ఉన్న 45 పేర్లజాబితాలో కొన్నింటిని మాత్రమే అధినేత్రి ఆమోదించారని తెలుస్తుంది. మరికొన్ని సమన్యయ కమిటీలోనిని, మరికొన్ని పార్టీ వర్గాల ద్వారా తెప్పించుకున్న పేర్లు ఇచ్చారు. దీంతో సరికొత్త జాబితా తయారు చేయవలసిందని సోనియా ముఖ్యమంత్రిని కోరారు. జాబాతా విషయమై బొత్సతో చర్చించాల్సిందిగా అహ్మద్ పటేల్ సూచించారు. ధర్మాన రాజీనామా వ్యవహారంతోపాటు మరికొందరి మంత్రుల సుప్రీంకోర్టు నోటీసుల గురించి ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. వీటితో పాటు తెలంగాణ అంశం కూడా  సోనియా ముందుంచారు. తగిన సమయంలో దానిపై నిర్ణయం తీసుకుంటామని సోనియా చెప్పారు. రాహుల్  ఆంద్ర ప్రదేశ్ పై  ఆసక్తి చూపుతుండటంతో రాష్ట్రరాజకీయాలను పూర్తిగా వివరించారు. రాహుల్ కోరిక మేరకు యువతకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. షిండే తోనూ వాయిలార్ రవితోనూ తెలంగాణ పోరు, ప్రస్తుతం తెలంగాణ ఎంపీల తీరు తెన్నులు, ప్రధాని జీవవైవిద్య సదస్సుకు హాజరైన సందర్బంలో తెలంగాణ మీడియా కు అనుమతి నివారణ దానిపై అన్ని రాజకీయ పార్టీలు ఒక్కతాటిపైకి రావడం మొదలైన వివ రాలను వారిరువురీ మద్యవుంచారు. రాష్ట్రానికి పనికి వచ్చే విద్యుత్ విషయం మాత్రం మొయిలీతో సుదీర్ఘంగా వివరించారు. రైతులకు కనీసం నాలుగు గంటలు కూడా ఉచిత విద్యుత్ అందించ లేక పోతున్నామని దీనివల్ల  ప్రజల్లో చులకనయిపోతున్నామని, ప్రత్యర్ధి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయని వెంటనే విద్యుత్ కెటాయించి ఆదుకోవాలని మొయిలీని కోరారు

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.