టీఆర్ఎస్ కి మద్దతు పై చంద్రబాబు వివరణ

 

 

సహకార ఎన్నికల్లో తెలంగాణ లో టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తామని తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరావు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన పై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు వివరణ ఇచ్చారు . సహకార ఎన్నికల్లో ఏ ఇతర పార్టీతోనూ టిడిపి పొత్తు పెట్టుకోదని చంద్రబాబు స్పష్టం చేశారు.


 
ఎర్రబెల్లి ప్రకటన తరువాత పార్టీ నేతల్లో గందరగోళం ఏర్పడంతో ఆయన వివరణ ఇచ్చారు. ఎన్నికల్లో అందరు కలిసి పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్సు లో ఎర్రబెల్లి తో మాట్లాడారని సమాచారం. టిడిపి పై టిఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తూన్న టైం లో ఎర్రబెల్లి ప్రకటన చేయడంతో పార్టీలో ఉత్కంఠ నెలకొంది. దాంతో టిడిపి అధినేత స్వయంగా రంగంలో దిగి వివరణ ఇవ్వడం విశేషం.

Teluguone gnews banner