కాంగ్రెస్ నుంచి 9 మంది ఎమ్మెల్యేల పై వేటు

 

 

 

 

జగన్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే లని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. జగన్ వైపు వెళ్లిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అయితే జగన్ గూటికి వెళ్లిన వారిలో ఆరుగురు మాత్రం ఓకే మరి మరో ముగ్గురు ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది.


జగన్ గూటికి వెళ్లిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఆళ్ల నాని(ఏలూరు), సుజయ కృష్ణ రంగారావు(బొబ్బిలి), మద్దాల రాజేష్(చింతలపూడి), ద్వారంపూడి చంద్రశేఖర్(కాకినాడ సిటీ), పేర్ని నాని(మచిలీపట్నం), పెద్దిరెడ్డి(పుంగనూరు)లు తమ పదవులకు రాజీనామాలు చేశారు. వీరు ఓకే మరి మిగిలిన ముగ్గురు ఎవరన్న చర్చ జరుగుతుంది.


పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాత్రం పేర్లు చెప్పేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. అయితే పిసిసి అధ్యక్షుడు ఆర్భాటంగా తొమ్మిది మంది అని చెప్పి పేర్లు ప్రకటించకపోవడం కాంగ్రెస్ బలహీనతగా కనిపిస్తుంది. రాజీనామాలు చేసిన వారి గురించి సభాపతి నాదెండ్ల మనోహర్ చూసుకుంటారన్నారు. అనర్హతపై నిర్ణయం తీసుకుంటామని బొత్స చెప్పారు.

Teluguone gnews banner