జగన్ కు చంద్రబాబు సెల్ఫీ చాలెంజ్!
posted on Apr 7, 2023 @ 3:58PM
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ఏపీసీఎం జగన్ కు సెల్ఫీ చాలెంజ్ విసిరారు. నెల్లూరు పర్యటనలో ఉన్న చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో కట్టిన వేలాది టిడ్కో గృహాల సముదాయం వద్ద సెల్ఫీ దిగారు. నెల్లూరులో మా ప్రభుత్వ హయాంలో నెల్లూరులో పేదల కోసం కట్టిన
నెల్లూరులో టీడీపీ హయాంలో కట్టిన వేలాది టిడ్కో ఇళ్లు ఇవి అంటూ ట్వీట్ చేశారు.
తెలుగుదేశం హయాంలో పేదల కోసం నిర్మించిన లక్షలాది ఇళ్లకు ఇది సజీవ సాక్ష్యం అని పేర్కొన్న చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో నువ్వు కట్టిన ఇళ్లెక్కడ జగన్ అంటూ చేసిన ఆ ట్వీట్ ను జగన్ కు ట్యాగ్ చేశారు. దానికి తాను దిగిన సెల్ఫీని జోడించారు.
చంద్రబాబు తన మెబైల్ పోన్ తో నెల్లూరు టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద సెల్ఫీ దిగి జగన్ కు చాజెంజ్ విసిరారు. రాష్ట్రంలో నాటి అభివృద్ధి పనులపై ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసరాలని తెలుగుదేశం లీడర్లు, క్యాడర్ కు చంద్రబాబు పిలుపునిచ్చారు.