ఉదయం ప్రధాని నాకు ఫోన్ చేశారు: చంద్రబాబు
posted on Apr 14, 2020 @ 3:24PM
లాక్‌డౌన్‌ను మే 3 వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈరోజు ఉదయం ప్రధానితో ఫోన్ లో కరోనా కట్టడి గురించి మాట్లాడానని తెలిపారు.
హైదరాబాద్‌లో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నిన్న ప్రధాని కార్యాలయానికి ఫోన్ చేశా.. ఆయనతో మాట్లాడాలని అడిగాను. అయితే, ఈ రోజు ఉదయం 8.30 గంటలకు ప్రధాని నాకు ఫోన్ చేశారు. ఆయనతో నా ఆలోచనలు పంచుకున్నా’’ అని చంద్రబాబు తెలిపారు.
కరోనా నియంత్రణ చర్యలపై ప్రధానికి ఇటీవల రాసిన లేఖలో కొన్ని సూచనలు చేశానని చంద్రబాబు అన్నారు. జోన్ల వారీగా కరోనా వ్యాప్తి ప్రాంతాలను విభజించమని ఆ లేఖలో కోరానన్నారు. ఇలాంటి సున్నితమైన అంశాలపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.