వైసీపీ ఎమ్మెల్యేతో సమావేశమైన ఎమ్మార్వోకు కరోనా!!
posted on Apr 14, 2020 @ 3:24PM
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటి వరకూ 473 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఓ తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన సన్నిహితులు, తోటి ఉద్యోగులు, ఆయనను కలిసిన రాజకీయ నేతల్లో కలవరం మొదలైంది.
ఇప్పటికే ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. ప్రస్తుతం వారందరూ వైద్యుల సమక్షంలో క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఈ తహసీల్దార్ మడకశిర వైసీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామితో పలుసార్లు సమావేశమయ్యారని తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే అనుచరుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, ఈ వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే ఇంతవరకూ స్పందించలేదు.