Read more!

చంద్రబాబు మంత్రివర్గ సమావేశ వివరాలు

 

ఆంధ్రప్రదేశ్ తొలి మంత్రి వర్గ సమావేశం దాదాపు ఆరు గంటల పాటు సాగింది. ఉదయం 11 గంటలకు మొదలయిన సమావేశం సాయంత్రం దాదాపు ఆరున్నర గంటల వరకు సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సాగిన ఈ సమావేశంలో మొత్తం మంత్రులు అందరూ పాల్గొన్నారు. సమావేశం తరువాత చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించి సమావేశ వివరాలు వెల్లడించారు.

 

ఆయన చెప్పిన విషయాలలో ముఖ్యాంశాలు:

1. రాష్ట్ర విభజన తరువాత బడ్జెట్ లోటు రూ.15,900 కోట్లు.

2. ఈనెల నుండే ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ 58 నుండి 60సం.లకు పెంపు అమలు. హైదరాబాదులో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు కూడా ఇది వర్తింపు.

3. అక్టోబర్ 2నుండి పెంచిన పెన్షన్లు చెల్లింపు మొదలవుతుంది. వృద్ధులకు, వితంతువులకు రూ.1000 పెన్షన్, 80 శాతం లేదా అంతకంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్న వికలాంగులకి రూ.1500, 80 శాతం కంటే తక్కువ అంగవైకల్యం ఉన్నవారికి రూ.1000 పెన్షన్.

4. బెల్ట్ షాపులు రద్దు చేయబడ్డాయి. త్వరలో ఎక్సయిజ్ శాఖ నిభందనలు మరింత కటినతరం.

5. వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీ కోసం కమిటీకి ఆమోదం. వీలయినంత త్వరగా రుణాలు మాఫీకి అవసరమయిన చర్యలు చేపడతాము.

6. యన్టీఆర్ సుజల స్రవంతి పధకం క్రింద రాష్ట్రంలో అన్ని పట్టణాలు, గ్రామాలకు రక్షిత మంచి నీరు పధకం అమలుకు అవసరమయిన ఏర్పాట్లు చేయడానికి పంచాయితీ రాజ్ శాఖ అధీనంలో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు.

7. రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం రూ.5,00,00,000 కోట్లు అవసరం ఉంటుంది. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం నుండి రాబట్టేందుకు కృషి చేస్తాము.

8. అధికారం, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాము. 9. వైజాగ్, విజయవాడ మరియు తిరుపతి నగరాలను మెగా సిటీలుగా అభివృద్ధి చేస్తాము.

10. వైజాగ్ నగరానికి మెట్రో రైలు, అంతర్జాతీయ విమానాశ్రయం, అవుటర్ రింగు రోడ్డు, అవసరమయిన చోట ఫ్లై ఓవర్ల నిర్మాణం.

11. వ్యవసాయానికి 8గంటలు, గృహలకు, పరిశ్రమలకు 24గంటలు నిరంత విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమయిన అన్ని చర్యలు చేపడతాము. అవసరమయితే పక్క రాష్ట్రాల నుండి విద్యుత్ కొనుగోలు. సోలార్ మరియు విండ్ ఎనర్జీ కొరకు అవసరమయిన చర్యలు చేపడతాము.

12. ఇంతవరకు నిర్లక్ష్యం చేయబడిన ఇంకుడు గుంతలు, చెక్ డ్యాములు మళ్ళీ అభివృద్ధి చేసిభూగర్భ జలాలను పెంచుతాము.