చంద్రబాబు, విజయమ్మ ఒకే చెప్పారు
posted on Sep 18, 2012 @ 3:28PM
తెలంగాణ ఏర్పాటుకు తెలుగుదేశం సానుకూలంగా ఉందని టిఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ చెప్పారు. తెలంగాణపై చిదంబరం గతంలో హామీ ఇచ్చారని,దానిని నేలబెట్టుకోవాలన్నారు. తెలంగాణా ఇచ్చేది, తెచ్చేది కాంగ్రెస్ పార్టీ అని గతంలో చెప్పారని, ఇప్పుడేమో దానిని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. వైయస్ విజయమ్మ కూడా ఇటీవల జరిగిన పరకాల ఉప ఎన్నికల సమయంలో తెలంగాణా ప్రజల మనోభావాలను గౌరమిస్తామన్నారని చెప్పారు. తెలంగాణపై తీర్మానం ప్రవేశ పెడితే ఐదు నిమిషాలలో పూర్తవుతుందన్నారు. తెలంగాణపై జాప్యం సరికాదని, అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టకుండా, కేంద్రంపై భారం వేయడం సరికాదన్నారు.