రైల్వే శాఖ పనితీరు చాల దారుణం:చంద్రబాబు
posted on Jul 30, 2012 @ 4:49PM
ఈ రోజు ఉదయం జరిగిన రైలు ప్రమాదస్థలాన్ని మాజీ ముఖ్యమంత్రి,చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రైల్వే శాఖ పనితీరు చాల దారుణంగా ఉందని అన్నారు. రైల్వే భద్రతకు కేటాయించిన నిధులలో 40శాతం కూడా ఖర్చు చేయడం లేదని, ఇది ప్రమాదమో లేక కుట్ర తేల్చాల్సిందని అన్నారు. రైలు ప్రమాదాలు పై దర్యాప్తు తూతూ మంత్రంగా జరిపిస్తున్నారని మండిపడ్డారు. రైల్వే పోలీసులు, రాష్ట్ర పోలీసులకు మద్య సమన్వయం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని, మృతుల కుటు౦బాలకు 20లక్షలు నష్టపరిహారాన్ని ప్రకటించాలని అన్నారు.