చంద్ర బాబుకు అన్ని పార్టీల థాంక్స్ !
posted on Dec 29, 2012 @ 3:16PM
నిన్న ఢిల్లీ లో తెలంగాణా విషయాన్ని చర్చించడానికి జరిగిన అఖిల పక్ష సమావేశాలో తెలుగు దేశం పార్టీ అవలంభించిన వైఖరికి తెలంగాణా ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణా కు అనుకూలమని హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకు సమర్పించిన లేఖలో చంద్ర బాబు పేర్కొనడంఫై వారంతా ఆనందంగా ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణా పార్లమెంట్ సభ్యులైతే బాబుకు ఏకంగా ధన్యవాదాలు తెలియచేసారు. మధు యాష్కి గౌడ్ ఓ వినూత్న ఆఫర్ ఇచ్చారు. ఆ మాటకే కట్టుబడి ఉంటే, తెలంగాణా రాష్రం ఏర్పాటు అయిన తర్వాత బాబు ముఖ్య మంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయని గౌడ్ వ్యాఖ్య చేశారు.
బాబు పాద యాత్ర తెలంగాణా ప్రాంతంలో సాగుతున్న సమయంలో జరిగిన ఇలాంటి పరిణామాలతో ఆ పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాత్ర వరంగల్ లో అడుగు పెట్టే సమయంలో బాబుకు ఘన స్వాగతం పలుకుతామని ఎర్రబెల్లి అన్నారు.
ఏది ఏమైనా, ప్రస్తుతానికి బాబు ఒక్క దెబ్బతో అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన నాయకునిగా మారిపోయాడు, ఒక్క టిఆర్ఎస్ కు తప్ప.